తెలంగాణ

telangana

'ఆ​ విషయంలో మూడో అంపైర్​ జోక్యం అవసరం'

By

Published : Apr 28, 2022, 8:20 AM IST

IPL 2022 Jayawardene No ball: బ్యాటర్​ నడుము కంటే ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చే నోబాల్స్​ విషయంలో మూడో అంపైర్​ జోక్యం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు ముంబయి ఇండియన్స్​ కోచ్ జయవర్దనె. ఇటీవలే జరిగిన దిల్లీ, రాజస్థాన్​ మ్యాచ్​లో ఫీల్డ్​ అంపైర్​ తన నిర్ణయానికి కట్టుబడడం వల్ల నోబాల్​ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో జయవర్దనె ఈ వ్యాఖ్య చేశాడు.

no ball jayawardene
నో బాల్ జయవర్దనె

IPL 2022 Jayawardene No ball: బ్యాటర్‌ నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే బంతిని నోబాల్‌గా ప్రకటించే విషయంలో మూడో అంపైర్‌ ప్రమేయం అవసరమని ముంబయి ప్రధాన కోచ్‌ జయవర్దనె అభిప్రాయపడ్డాడు. ఇటీవల రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న పావెల్‌ నడుం కంటే ఎక్కువ ఎత్తులో బంతి వచ్చినా నోబాల్‌ ఇవ్వకపోవడంపై దిల్లీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ప్రస్తుతానికి బౌలర్‌ గీత దాటి బంతి వేస్తే మూడో అంపైర్‌ అది గమనించి.. మైదానంలోని అంపైర్లకు ఆ సమాచారాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కువ ఎత్తులో వచ్చే బంతికి కూడా అదే విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని ఐసీసీ క్రికెట్‌ కమిటీలో సభ్యుడు కూడా అయిన జయవర్దనె తెలిపాడు.

"బహుశా.. అంపైర్లు తప్పుడు నిర్ణయం తీసుకున్నారేమో. కానీ నిబంధనల ప్రకారం నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే బంతి విషయంలో మూడో అంపైర్‌ను మనం సంప్రదించే అవకాశం లేదు. మూడో అంపైర్‌ అలాంటి బంతిని పరిశీలించండి అని అంపైర్లకు చెప్పే విషయాన్ని పరిశీలించాలి" అని అతను పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: రషీద్, తెవాతియా మెరుపులు.. ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

ABOUT THE AUTHOR

...view details