ETV Bharat / sports

రషీద్, తెవాతియా మెరుపులు.. ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

author img

By

Published : Apr 27, 2022, 11:39 PM IST

Updated : Apr 28, 2022, 12:08 AM IST

IPL 2022 SRH Vs gt: సన్​రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేకులు పడ్డాయి. గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆరెంజ్ ఆర్మీ చతికిలపడింది. హైదరాబాద్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.

SUNRISERS VS GUJARAT TITANS
SUNRISERS VS GUJARAT TITANS

IPL 2022 SRH Vs gt: హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో రాహుల్‌ తెవాతియా (40), రషీద్‌ఖాన్‌ (31) మెరుపులు మెరిపించారు. చివరి ఓవర్‌లో 22 పరుగులు అవసరం కాగా.. రాహుల్‌ తెవాతియా ఒక సిక్స్ బాదగా.. రషీద్‌ఖాన్‌ మూడు సిక్స్‌లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 196 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి గుజరాత్​ టైటాన్స్ చేరుకుంది. మొదట్లో వృద్ధిమాన్ సాహా(68) పరుగులతో జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ ఒక్కడే ఐదు వికెట్లు పడగొట్టగా.. మిగతా బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు.

ఈ సీజన్​లో తొలిసారి టాస్ ఓడిన సన్​రైజర్స్​కు... గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య బ్యాటింగ్ అప్పగించాడు. విలియమ్సన్(5) మూడో ఓపర్లోనే ఔట్ అయినా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(65) భారీ షాట్లతో అలరించాడు. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లక్ష్యంగా చేసుకొని సిక్సర్ల వర్షం కురిపించాడు. త్రిపాఠి(10 బంతుల్లో 16) కాసేపటికే వెనుదిరిగినా.. మార్​క్రమ్​తో కలిసి ఇన్నింగ్స్​ను నడిపించాడు. ఇన్నింగ్స్​కు హైలైట్​గా నిలిచింది మాత్రం శశాంక్ సింగ్ ఆటే. గత కొన్ని మ్యాచుల నుంచి సన్​రైజర్స్ తుది జట్టులో ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశం అతడికి రాలేదు. గుజరాత్​తో మ్యాచ్​లో ఈ అవకాశం వచ్చేసరికి రెచ్చిపోయాడు. ఆడింది ఆరు బంతులైనా.. మూడు సిక్సర్లు, ఒక ఫోర్​తో (25) పరుగులతో విరుచుకుపడ్డాడు. చివరి ఓపర్లో హ్యాట్రిక్ సిక్సులు బాది.. సన్​రైజర్స్​కు భారీ స్కోరు సాధించి పెట్టాడు.

ఇదీ చదవండి: చేతులెత్తేసిన బెంగళూరు.. రాజస్థాన్​ హ్యాట్రిక్​​ విజయం

Last Updated :Apr 28, 2022, 12:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.