తెలంగాణ

telangana

భారీగా పెరిగిన IPL విలువ.. రూ.87 వేలకోట్లకు పైగా..

By

Published : Dec 22, 2022, 8:13 AM IST

Updated : Dec 22, 2022, 12:14 PM IST

ఐపీఎల్‌ తాజాగా రూ.87 వేల కోట్ల విలువకు చేరుకుందట. డీఅండ్‌పీ అనే సంస్థ ఈ మేరకు ఐపీఎల్‌ విలువను లెక్కగట్టింది. కొన్ని నెలల కిందట జరిగిన వేలంలో ఐపీఎల్‌ మీడియా హక్కులు వచ్చే ఐదేళ్ల కాలానికి దాదాపు రూ.48 వేల కోట్లు పలికింది. దీంతో ఐపీఎల్‌ విలువ కూడా పెరిగి 10.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

IPL Value
IPL Value

IPL Value: సీజన్‌ సీజన్‌కూ ఇంతింతై అన్నట్లు ఎదిగిపోతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తాజాగా రూ.87 వేల కోట్ల విలువకు చేరుకుందట. డి అండ్‌ పి అనే సంస్థ ఈ మేరకు ఐపీఎల్‌ విలువను లెక్కగట్టింది. కొన్ని నెలల కిందట జరిగిన వేలంలో ఐపీఎల్‌ మీడియా హక్కులు వచ్చే ఐదేళ్ల కాలానికి దాదాపు రూ.48 వేల కోట్లు పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ విలువ కూడా పెరిగి 10.9 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.87 వేల కోట్లు) చేరుకుంది. 2014లో 3.2 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న ఈ లీగ్‌ విలువ.. 2020కి 6.2 బిలియన్లకు పెరిగింది. ఈ ఏడాది ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు రావడం, మీడియా హక్కులు ఊహించని రేటు పలకడంతో లీగ్‌ విలువ అమాంతం పెరిగి 10 బిలియన్‌ మార్కును దాటేసింది.

టీమ్‌ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా వైదొలగనున్న బైజూస్‌!:టీమ్‌ఇండియా ప్రధాన స్పాన్సర్లలో రెండు బైజూస్‌, ఎంపీఎల్‌లు తమ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాల నుంచి వైదొలగాలని అనుకుంటున్నాయి. 2023 నవంబరు వరకు భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ఉండేందుకు ఈ జూన్‌లో బీసీసీఐతో బైజూస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇప్పుడు ఆ సంస్థ వైదొలగాలనుకుంటోంది. మరోవైపు టీమ్‌ఇండియా కిట్‌ అండ్‌ మర్చండైజ్‌ స్పాన్సర్‌ ఎంపీఎల్‌.. తన హక్కులను కేకేసీఎల్‌ అనే కంపెనీకి బదిలీ చేయాలనుకుంటోంది.. ఈ మేరకు బైజూస్‌, ఎంపీఎల్‌లు తమ నిర్ణయం గురించి బీసీసీఐతో చెప్పాయి. అయితే కనీసం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగాలని ఈ స్పాన్సర్లను బీసీసీఐ కోరింది. ఈ అంశంపై బుధవారం బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించారు.

Last Updated : Dec 22, 2022, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details