తెలంగాణ

telangana

ఆ ఒక్క వికెట్​తో చాహల్​ రికార్డు సృష్టిస్తాడా?

By

Published : Feb 19, 2022, 10:57 PM IST

IND vs WI 3rd T20: విండీస్​తో ఆదివారం ఆఖరి టీ20 జరగనున్న నేపథ్యంలో స్పిన్నర్​ చాహల్​ ఓ రికార్డు సాధించేందుకు అవకాశం ఉంది. ఒక్క వికెట్​ తీస్తే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా నిలుస్తాడు.

ind vs wi
చాహల్

IND vs WI 3rd T20: భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ టీ20ల్లో ఓ రికార్డును సృష్టించేందుకు వికెట్‌ దూరంలో ఉన్నాడు. మరో వికెట్‌ పడగొడితే పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (66 వికెట్లు 55 మ్యాచ్‌ల్లో), చాహల్‌ (66 వికెట్లు 52 మ్యాచ్‌ల్లో) సమానంగా ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జరిగే మూడో (చివరి) టీ20లో వెస్టిండీస్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చాహల్‌ ఒక్కవికెట్‌ పడగొట్టినా అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. ఈ సిరీస్‌లో బుమ్రా ఆడటం లేదు.

మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌.. 3-0 తేడాతో కైవసం చేసుకుని కరీబియన్‌ జట్టును వైట్‌వాష్‌ చేసింది. టీ20 సిరీస్‌లో కూడా భారత జట్టు అదే జోరును కొనసాగిస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకున్న రోహిత్‌ సేన.. ఆదివారం జరగనున్న ఆఖరి (మూడో) టీ20లోనూ గెలుపొంది మరోసారి విండీస్‌ను వైట్‌వాష్‌ చేయాలని తహతహలాడుతోంది.

ఇదీ చూడండి :ఫీజు చెల్లించలేదని పీఎస్​ఎల్​ నుంచి క్రికెటర్ వాకౌట్

ABOUT THE AUTHOR

...view details