తెలంగాణ

telangana

లంకపై భారత్ గెలుపు.. బ్యాటర్​గా రోహిత్ సరికొత్త రికార్డు

By

Published : Feb 24, 2022, 10:22 PM IST

IND VS SL: లంకతో టీ20లో భారత ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ఆకట్టుకునే బ్యాటింగ్​ చేసిన రోహిత్ శర్మ.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

team india
టీమ్​ఇండియా

శ్రీలంకతో టీ20 సిరీస్​లో భారత్ బోణీ కొట్టింది. లక్నో వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్​లో 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్​కు తోడు శ్రేయస్​ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలి వికెట్​కు రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్, 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే 44 పరుగులు చేసిన రోహిత్.. లహిరు కుమార బౌలింగ్​లో ఔటయ్యాడు.

రోహిత్ రికార్డు

Rohit sharma: ఈ క్రమంలోనే రోహిత్.. టీ20ల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్​లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్​గా నిలిచాడు. ప్రస్తుతం ఇతడు.. 3307 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో గప్తిల్ (3299), కోహ్లీ(3296) కొనసాగుతున్నారు.

రోహిత్ శర్మ

రోహిత్ ఔట్ తర్వాత శ్రేయస్​తో కలిసి ఇషాన్.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇషాన్ సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ 89 పరుగుల వద్ద ఔటైపోయాడు. అనంతరం దంచికొట్టిన శ్రేయస్.. 57 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. జడేజా 3 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో 199 పరుగులు చేసింది భారత్.

అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనలో లంక తడబడింది. తొలి బంతికే నిషాంక వికెట్​ కోల్పోయింది. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో ఓవర్లన్నీ ఆడి పరుగులు చేసిందీ జట్టు. శ్రీలంక బ్యాటర్లలో అసలంక అత్యధికంగా 53 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ తలో రెండు వికెట్లు తీయగా, జడేజా, చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్​లో చండిమల్​ వికెట్​ తీసిన తర్వాత.. 'పుష్ప' మేనరిజంతో జడేజా మెప్పించాడు.

పుష్ప మేనరిజంతో జడేజా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details