తెలంగాణ

telangana

'చరిత్ర సృష్టించడానికి.. భారత్​కిదే అద్భుత అవకాశం'

By

Published : Dec 21, 2021, 10:20 PM IST

దక్షిణాఫ్రికా టీంలో సీనియర్లు లేమి టీమ్​ఇండియాకు కలిసివస్తుందని అభిప్రాయపడ్డాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్​. సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించడానికి ఇది సరైన అవకాశమని అన్నాడు.

Ind vs sa Test series
సునీల్ గావస్కర్

IND VS SA TEST: విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. నేటివరకు ఒక్కసారి కూడా ఆఫ్రికా గడ్డ మీద మన జట్టు టెస్టు సిరీస్‌ నెగ్గలేదు. ఈ సారైనా కప్పుతో స్వదేశానికి తిరిగిరావాలని భావిస్త్తోంది. అయితే.. దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఏబీ డెవిలియర్స్, డుప్లెసిస్​ టెస్టు సిరీస్​కు రిటైర్​మెంట్ ఇచ్చారు. డీ కాక్​ కూడా ఈ టెస్టు సిరీస్​కు హాజరుకాకపోవచ్చని సమాచారం. ఈ విషయాన్నే దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గవాస్కర్​ టీమ్ ఇండియాకు కలిసివచ్చే అవకాశం అన్నాడు. 'దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాళ్లు​ లేకపోవడం కోహ్లీ సేనకు కలిసివస్తుంది. డీకాక్ లేకపోవడం టీమ్​ఇండియా చరిత్ర సృష్టించడానికి ఇది సరైన సమయం' అని అభిప్రాయపడ్డాడు.

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. టెస్టు సిరీస్‌ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు.

గతం ఇలా..

గత ముప్పై ఏళ్ల (1992) నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఇరు దేశాల్లో చెరో ఏడేసి సార్లు పర్యటించాయి. మొత్తం 39 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో 20 టెస్టులు దక్షిణాఫ్రికాలో మరో 19 టెస్టులు భారత్‌లో జరిగాయి. స్వదేశంలో టీమ్‌ఇండియా ఎంత పటిష్ఠమైన జట్టో మనందరికీ తెలుసు. కానీ 19 టెస్టుల్లో భారత్ పదకొండు, దక్షిణాఫ్రికా ఐదు గెలుచుకోగా.. మరో మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇందులో ఒక సిరీస్‌నూ ప్రొటీస్ జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయితే దక్షిణాఫ్రికా వారి దేశంలో మాత్రం టీమ్‌ఇండియాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆఫ్రికా నేల మీద భారత్‌ ఒక్క సిరీసూ నెగ్గలేదు. మరి ఈ టెస్టులో ఏం జరగనుందో వేచిచూడాల్సిందే!.

ఇదీ చదవండి:IND vs SA Test Series: ఇప్పటి వరకు ఒక్కటీ లేదు.. ఈ సారైనా సిరీస్‌ దక్కేనా..?

ABOUT THE AUTHOR

...view details