తెలంగాణ

telangana

అది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమే..: గంగూలీ

By

Published : Jan 16, 2022, 10:47 AM IST

Ganguly on Kohli: టీమ్​ఇండియా టెస్టు సారథిగా విరాట్ కోహ్లీ తప్పుకొన్నాడు. ఈ నిర్ణయం మాజీ క్రికెటర్లను, అభిమానులను షాక్​కు గురిచేసింది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా స్పందించాడు.

ganguly, kohli
గంగూలీ, కోహ్లీ

Ganguly on Kohli: టీమ్​ఇండియా టెస్టు సారథిగా తప్పుకొంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్​ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్​ ఓటమి అనంతరం.. సోషల్​ మీడియాలో ఈ అనూహ్య ప్రకటన చేశాడు. దీనిపై భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. కోహ్లీ సారథ్యంలో టీమ్​ఇండియా ఎన్నో ఘనతలు సాధించిందని పేర్కొన్నాడు.

"విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్​ఇండియా అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా రాణించింది. సారథిగా తప్పుకోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. బీసీసీఐ ఈ నిర్ణయాన్ని గౌరవిస్తుంది. భవిష్యత్తులో ఓ ఆటగాడిగా కోహ్లీ.. జట్టు కోసం మరెన్నో ఘనతలు సాధించాలి. అతడో గొప్ప ప్లేయర్."

--గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

టీ20 ప్రపంచకప్​ అనంతరం కోహ్లీ టీమ్​ఇండియా టీ20 సారథిగా తప్పుకొన్నాడు. అనంతరం.. అతడిని వన్డే కెప్టెన్​గానూ తొలగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టుకు కూడా కోహ్లీ గుడ్​బై చెప్పడం అభిమానులకు నిరాశకు గురిచేసింది.

కోహ్లీ కెప్టెన్సీ అంశంపై మాట్లాడాడు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్. 'బీసీసీఐ నుంచి కోహ్లీపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. దీన్ని మేం గౌరవిస్తున్నాం. కానీ, మరో రెండు మూడేళ్లపాటు కోహ్లీ కెప్టెన్​గా కొనసాగితే బాగుండేది.' అని ధుమాల్ అన్నాడు.

కోహ్లీ ట్వీట్..

"ఏడేళ్లు ఎంతో కష్టపడి జట్టును సరైన దిశలో నడిపించా. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు విరామం తీసుకోక తప్పదు. ఏడేళ్ల నా కెప్టెన్సీలో నిజాయితీగా బాధ్యతలు నిర్వహించా. బీసీసీఐ, రవిశాస్త్రి, ధోనికి నా కృతజ్ఞతలు" అని కోహ్లీ తన లేఖలో పేర్కొన్నాడు.

బీసీసీఐ అభినందనలు..

విరాట్‌ కోహ్లీకి అభినందనలు తెలిపింది బీసీసీఐ. 'కోహ్లీ గొప్ప నాయకత్వ పటిమ చూపాడు. భారత టెస్టు జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా రాణించాడు. 68 మ్యాచ్​లకు నాయకత్వం వహించి 40 విజయాలు అందించాడు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై చెప్పిన తర్వాత పలువురు మాజీ క్రికెటర్లు ట్వీట్ చేశారు. కోహ్లీ ఓ గొప్ప సారథి అంటూ ట్విట్టర్​ వేదికగా ప్రశంసలు కురిపించారు.

ఇదీ చదవండి:

Kohli Captaincy: టెస్టు సారథిగా కింగ్ కోహ్లీ రికార్డులివే..

విరాట్​ కోహ్లీ సంచలన నిర్ణయం

Kohli captain: కెప్టెన్సీ వీడ్కోలు.. వారికి ముందే చెప్పిన కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details