తెలంగాణ

telangana

Diamond League Final 2023 : నేడే డైమండ్​ లీగ్​ ఫైనల్​.. 90 మీటర్లపై గోల్డెన్ బాయ్ కన్ను.. అందుకుంటాడా?

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 7:16 AM IST

Updated : Sep 16, 2023, 8:03 AM IST

Diamond League Final 2023 Neeraj Chopra : ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్​ మెడల్​ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా.. ఇప్పుడు డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ కోసం బరిలో దిగుతున్నాడు. మరి ఈ పోరులో అతడు నెగ్గడంతో పాటు తన 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటాడో లేదో చూడాలి..

Diamond League Final 2023 : ఇక డైమండ్​ లీగ్​పై బంగారు బాలుడు కన్ను.. 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటాడా?
Diamond League Final 2023 : ఇక డైమండ్​ లీగ్​పై బంగారు బాలుడు కన్ను.. 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటాడా?

Diamond League Final 2023 Neeraj Chopra : ఈ ఏడాది వరల్డ్​ అథ్లెటిక్స్‌లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా గోల్డ్ మెడల్​ ముద్దాడి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిక అతడి లక్ష్యం.. డైమండ్‌ లీగ్‌ టైటిల్​పై కన్ను పడింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో గెలవడం కోసం అతడు బరిలోకి దిగుతున్నాడు. శనివారం డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ జరగనున్నాయి. ఇందులో అతడు పోటీపడనున్నాడు.

Diamond League Neeraj Chopra Throw :25 ఏళ్ల నీరజ్‌.. గతేడాది డైమండ్‌ లీగ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సీజన్‌లోనూ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఉపులోనే మరోసారి విజేతగా నిలిచి.. వరుసగా రెండు సార్లు టైటిల్ అందుకున్న మూడో అథ్లెట్‌గా నిలవాలని పట్టుదలతో ఉన్నాడు. అతడు ఈ ఏడాది దోహా, లాసానె డైమండ్‌ లీగ్‌ అంచె పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి, జూరిచ్‌లో(85.71 మీటర్లు) రెండో స్థానం దక్కించుకుని ఫైనల్స్​కు అర్హత సాధించాడు.

ఆ మధ్యలో కండరాల గాయంతో అతడు దాదాపు నెల పాటు ఆటకు దూరంగా ఉన్నప్పటికీ.. తిరిగి బలంగా పుంజుకున్నాడు. ఇప్పుడు ఈ తుది పోరులో ఎలాగైనా జయకేతనం ఎగురవేయడంతో పాటు తన 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లో అతడు ఉత్తమ ప్రదర్శన 88.77 మీటర్లుగా ఉంది. చూడాలి మారి అతడు టైటిల్​ నెగ్గడంతో పాటు తన లక్ష్యాన్ని ఈ సారైనా అందుకుంటాడో లేదో. ఇకపోతే ఈ ఫైనల్​లో టైటిల్‌ కోసం జాకబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), పీటర్స్‌ అండర్సన్‌ (గ్రెనడా)తో కూడా పోటీపడుతున్నారు. వీరి నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. కాగా, 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత చరిత్ర తిరగరాస్తూ నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని ముద్దాడిన సంగతి తెలిసిందే.

ఇకపోతే నీరజ్ ఫైనల్ ​ పోరు గురించి తెలుసుకుంటున్న అతడి అభిమానులు.. నీరజ్​ ఎలాగైనా టైటిల్​ నెగ్గాలని సోషల్​ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఎలాగైనా అతడు 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తున్నారు.

Neeraj Chopra Diamond League : డైమండ్‌ లీగ్‌లో నీరజ్​కు రెండో స్థానం.. సెప్టెంబర్​ 17న ఫైనల్

Neeraj Chopra Diamond League 2023 : నీరజ్​ చోప్రా.. ఇక డైమండ్‌ లీగ్‌ స్వర్ణంపై గురి

Last Updated :Sep 16, 2023, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details