తెలంగాణ

telangana

బీసీసీఐ.. నాడు ధోనీని కెప్టెన్‌గా ఎందుకు నియమించిందంటే?

By

Published : Jun 20, 2023, 7:02 PM IST

Dhoni captaincy : బీసీసీఐ మహేంద్రసింగ్‌ ధోనీకి కెప్టెన్సీ పగ్గాలను అప్పగించడానికి గల కారణాలను తెలిపారు ఓ మాజీ సెలెక్టర్. ఆ వివరాలు..

Dhoni
బీసీసీఐ.. మహీని కెప్టెన్‌గా నియమించడం వెనుకున్న కారణాలివే!

Dhoni captaincy : మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ పేరు వింటే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. అతడు బ్యాట్ పడితే మైదానం మొత్తం ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా పేరుగాంచాడతడు. చాలా కాలం పాటు టీమ్‌ఇండియాకు సారథిగా సేవలందించాడు. భారత క్రికెట్‌ చరిత్రలోనే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలోనూ తన కెప్టెన్సీతో భారీ సంఖ్యలో ఫ్యాన్స్​ను సంపాదించుకున్నాడు. భారత జట్టుకు వన్డే, టీ20 వరల్డ్​ కప్‌తో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించిన ఘన చరిత్ర అతడికి సొంతం. ఇక ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా ఐదు టైటిళ్లను అందించాడు.

Dhoni icc trophy list : 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఇలా మహీ సారథ్యంలో టీమ్‌ఇండియా మూడు ఐసీసీ ట్రోఫీలను ముద్దాడింది. దీంతో అతడు మూడు ఐసీసీ టైటిళ్లను అందించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, గత పదేళ్లుగా టీమ్​ఇండియా ఏ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ విజేతగా నిలవలేదు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులేత్తేస్తున్నారు. ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్నారు.

Team india icc trophies : కెప్టెన్సీలను మారుస్తున్నా, ప్లేయర్లను మారుస్తున్నా.. పదేళ్లుగా టీమ్‌ఇండియాది ఇదే తంతు. ఐసీసీ ట్రోఫీ కరవు తీరట్లేదు. రీసెంట్​గా జరిగిన వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లోనూ భారత జట్టు ఓటమిని అందుకుంది. దీంతో రోహిత్‌ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని ఫుల్​గా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పట్లో మహీని సారథిగా బీసీసీఐ నియమించడం వెనుక ఉన్న కారణాలను తెలిపారు భారత మాజీ సెలెక్టర్ భూపిందర్ సింగ్.

"టీమ్​లో ఉన్న ప్లేయర్స్​లో ఎవరో ఒకరిని ఆటోమేటిక్‌గా ఎంపిక చేయం. కెప్టెన్‌గా నియమించాలనుకునే ప్లేయర్​కు.. క్రికెట్‌పై ఉన్న అవగాహన, బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుండి సమర్థవంతంగా నడిపించగల నైపుణ్యం, మానవ వనరులను ఉపయోగించుకునే టాలాంట్​ను సెలక్టర్స్‌ చూస్తారు. మేము అలానే మహీ ఆట తీరు, బాడీ లాంగ్వేజ్, స్కిల్స్​, ఇతరుల అతడు ఉండే విధానం, మాట్లాడే విధానాన్ని చూశాం. దీంతో అతడిపై ఓ పాజిటివ్​ ఫీలింగ్​ ఏర్పడింది. అందుకే అతడిని కెప్టెన్​గా ఎంపిక చేశాం" అని భూపిందర్ సింగ్ వివరించారు.

ఇదీ చూడండి :

ధోనీ బౌలింగ్‌.. విరాట్‌ కోహ్లీ కీపింగ్‌.. వీడియో చూశారా?

IPL 2023 : అది క్రేజ్ అంటే​.. విమాన శబ్దం కన్నా ధోనీ సౌండే ఎక్కువట!

ABOUT THE AUTHOR

...view details