తెలంగాణ

telangana

26/11 అమరులకు క్రీడాసమాజం అశ్రు నివాళులు

By

Published : Nov 26, 2019, 8:53 PM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయిల జరిగిన మారణహోమానికి నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ తదితరులు అమరులకు నివాళి అర్పించారు.

sports persons Pays Tribute To Victims Of 26/11 Attack
ముంబయి దాడి

ముంబయిలో ఉగ్రదాడి జరిగి నేటికి 11 ఏళ్లయిన నేపథ్యంలో క్రీడా సమాజం బాధితులకు నివాళులు అర్పించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సచిన్ తెందూల్కర్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే తదితరులు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు.

"26/11 ఉగ్రదాడిలో అసువులు బాసిన అమాయక ప్రజల ధైర్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వాళ్లు వెళ్లిపోవచ్చు.. కానీ మర్చిపోకూడదు" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.

"ఇది జరిగి 11 ఏళ్లయినప్పటికీ, ఆ దాడిలో అమరులైన పోలీసులు, సైనికులను ఎప్పటికీ మర్చిపోకూడదు. దేశ ఖ్యాతిని, మానవత్వాన్ని పెంచేందుకు వాళ్లు ప్రాణాలర్పించారు. బాధిత కుటుంబాలను చూస్తుంటే నా హృదయం చలించిపోతోంది" -సచిన్ తెందూల్కర్

"ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా మౌనం పాటిస్తున్నా. మనల్ని కాపాడటం కోసం వారు అమరులయ్యారు" -చతేశ్వర్ పుజారా, టీమిండియా క్రికెటర్

"26/11 దాడి జరిగినపుడు నగరం ఎలా ఉందో ఇప్పటికీ గుర్తుంది. భద్రతా బలగాలు ధైర్య సాహసాలకు వారిని గౌరవించాల్సిందే" -అజింక్య రహానే

"ముంబయిలో జరిగిన ఉగ్రదాడి.. అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది. మనల్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన వారికి జోహార్లు. మనం ఎప్పటికీ వారిని గుర్తుంచుకోవాలి"-సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్

ఇదీ జరిగింది

2008 నవంబర్ 26న జరిగిన ఈ దాడి.. నాలుగు రోజుల పాటు కొనసాగింది. పాక్​ నుంచి సముద్ర మార్గం ద్వారా భారత్​కు చేరుకున్న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ముంబయి ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, నారిమన్ పాయింట్, తాజ్​ హోటల్, కామా ఆసుపత్రి, ఓబెరాయ్​ హోటల్​పై దాడికి దిగారు.

పాశవికంగా జరిగిన ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ భద్రతా దళం(ఎన్​ఎస్​జీ) చేపట్టిన ఆపరేషన్​ ద్వారా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో చిక్కగా 2012లో అతడికి ఉరిశిక్ష విధించారు.

ఇదీ చదవండి: భారత అంపైర్​కు పదేళ్లు పడతుంది: టాఫెల్​

ABOUT THE AUTHOR

...view details