తెలంగాణ

telangana

వైద్యుల పర్యవేక్షణలో పంత్​... రాజ్​కోట్​కు అనుమానం!

By

Published : Jan 15, 2020, 4:18 PM IST

ఆసీస్​తో తొలి వన్డేలో కాంకషన్​కు గురైన పంత్.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు. గాయం తీవ్రమైతే అతడు రెండో వన్డేకు అందుబాటులోకి రాకపోవచ్చు.

rishabh pant availability for rajkot odi in doubt
భారత వికెట్​ కీపర్​ రిషభ్ పంత్

భారత వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌.. కాంకషన్‌ (తల అదరడం)కు గురయ్యాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఈ సంఘటన జరిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌ 44వ ఓవర్లో కమిన్స్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ డెలివరీని... పంత్‌ పుల్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో మొదట బ్యాట్‌కు తగిలిన బంతి.. ఆ తర్వాత హెల్మెట్‌ను తాకింది. అప్పట్నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రిషభ్​... రాజ్​కోట్​లో జరిగే రెండో వన్డేకు​ అందుబాటులోకి ఉండకపోవచ్చని సమాచారం.

భారత వికెట్​ కీపర్​ రిషభ్ పంత్

ఆసీస్​తో మొదటి మ్యాచ్​లో... రిషభ్​ పంత్​ స్థానంలో కేఎల్​ రాహుల్ కీపింగ్​ బాధ్యతలు చేశాడు. పంత్​ కోలుకోడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఒకవేళ అతడి గాయం తీవ్రమైతే.. ప్రస్తుతం న్యూజిలాండ్​లో ఇండియా-ఏ తరఫున ఆడుతున్న సంజు శాంసన్​కు అవకాశం వస్తుందేమో చూడాలి. లేదంటే రాహుల్​ కీపర్​గా, మనీశ్​ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details