తెలంగాణ

telangana

శతక్కొట్టిన గిల్​.. కోహ్లీ హాఫ్​ సెంచరీ.. మూడో రోజు ఆట పూర్తి

By

Published : Mar 11, 2023, 5:06 PM IST

ind vas aus third day innings
ind vas aus third day innings ()

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా​, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్​ మూడో రోజు ఆట పూర్తయింది. మూడో రోజు ఆట పూర్తైయ్యే సరికి టీమ్​ఇండియా 3 వికెట్లు కోల్పోయి​ 289 పరుగులు సాధించింది. దీంతో ఆసీస్‌ కంటే 191 పరుగులు వెనుకబడి ఉంది. టీమ్ఇండియా బ్యాటర్లు శుభ్​మన్​ గిల్​, విరాట్​ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు.

బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 99 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ బ్యాటర్ శుభ్​మన్​ గిల్​ (128) పరుగులతో శతక ప్రదర్శన చేశాడు. కెప్టెన్​ రోహిత్​ శర్మ(35), ఛెతేశ్వర్​ పుజారా(42) రాణించారు. ప్రస్తుతం విరాట్​ కోహ్లీ(59), జడేజా(16*) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఇక ఆసీస్​ బౌలర్లు నాథన్​ లయోన్, మాథ్యూ కునేమన్, టాడ్​ ముర్ఫీ ఒక్కో వికెట్​ పడగొట్టారు.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 255/4 తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా.. 167.2 ఓవర్లలో 480 పరుగుల వద్ద ఆలౌటైంది. ఖవాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలు బాది అదరగొట్టారు. ట్రావిస్‌ హెడ్‌ (32), స్టీవ్‌ స్మిత్‌ (38), నాథన్‌ లైన్‌ (34), మర్ఫీ (41) పరుగులతో రాణించారు. భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

శతక్కొట్టిన గిల్​..
టీమ్ఇండియా యువ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్ శతక్కొట్టాడు. 235 బంతుల్లో 128 పరుగుల చేశాడు. దీంతో టెస్టు కెరీర్​లో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. కాగా, స్వదేశంలో గిల్​కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం గిల్​ 15వ టెస్టు ఆడుతున్నాడు. అయితే, మూడో టెస్టులో కఠిన పిచ్​పై అనుకున్నంతగా రాణించలేకపోయాడు. దీంతో టీమ్ఇండియా మాజీ దిగ్గజం సునీల్​ గావస్కర్​ గిల్​ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇలాగే ఆడితే భవిష్యత్​లో గిల్​ 8 వేల నుంచి 10 వేల పరుగులు సునాయాసంగా చేస్తాడని పేర్కొన్నాడు.

శుభ్​మన్​ గిల్

14 నెలల తర్వాత అర్ధ శతకం.. కోహ్లీ మరో ఘనత
ఈ మ్యాచ్​లో 14 నెలల తర్వాత టెస్టుల్లో అర్ధ సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ. ఇదే కాకుండా కోహ్లీ టెస్టుల్లో స్వదేశంలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

దిగ్గజాల సరసన ఛెతేశ్వర్​ పుజారా..
తన 101వ టెస్టు ఆడుతున్న పుజారా ఫర్వాలేదనిపించాడు. 42 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు. అయినా.. ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో ఆసీస్​పై 2000 పైగా పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్​గా అవతరించాడు. ఇంతకుముందు సచిన్​ తెందూల్కర్, వీవీఎస్​ లక్ష్ణణ్​, రాహుల్​ ద్రవిడ్ ఈ లిస్ట్​లో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details