తెలంగాణ

telangana

కోహ్లీ పాత్రను తక్కువ చేయలేం: నెహ్రా

By

Published : Nov 10, 2021, 2:12 PM IST

టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ(virat kohli news) వల్లే స్థిరత్వం వచ్చిందని అన్నాడు మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా(ashish nehra on virat kohli). కోహ్లీలాంటి అనుభవమున్న క్రికెటర్ జట్టుకు చాలా అవసరమని తెలిపాడు.

Ashish Nehra
నెహ్రా

టీమ్ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్లో విరాట్‌ కోహ్లీ(virat kohli news) వల్లే స్థిరత్వం వచ్చిందని మాజీ పేసర్‌ ఆశిష్ నెహ్రా(ashish nehra on virat kohli) అన్నాడు. ఇప్పటికే పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు వదిలేసిన విరాట్‌కు త్వరలో న్యూజిలాండ్‌తో జరగునున్న టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో కోహ్లీని భవిష్యత్తులో టీ20 క్రికెట్‌ నుంచి పూర్తిగా పక్కన పెట్టే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ పేసర్‌ ఆశిస్‌ నెహ్రా(ashish nehra on virat kohli) స్పందించాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆడాలని, జట్టులో ఎంతమంది హిట్టర్లు ఉన్నా.. కోహ్లీ లాంటి సీనియర్ల అవసరముందని పేర్కొన్నాడు.

"టీ20 క్రికెట్లో కోహ్లీ(virat kohli news) మరికొంత కాలం కొనసాగాలి. ఎందుకంటే వచ్చే ఏడాదే ఆస్ట్రేలియాలో మరో ప్రపంచకప్‌(t20 world cup 2022) ఉంది. అక్కడి మైదానాలు దుబాయ్‌ మైదానాల కంటే పెద్దగానూ, బ్యాటింగ్‌కు అనుకూలంగానూ ఉంటాయి. అయితే, కోహ్లీని పక్కన పెట్టి.. సూర్యకుమార్ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లను 3,4,5 స్థానాల్లో బ్యాటింగ్‌కి పంపడం సరికాదు. అన్ని సార్లు అది వర్కౌట్ కాదు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో కూడా కోహ్లీ మెరుగ్గా రాణించాడు. పాకిస్థాన్‌పై అందరూ విఫలమైన సమయంలో.. నిలకడగా ఆడుతూ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. జట్టులో ఎంతమంది పవర్‌ హిట్టర్లున్నా కోహ్లీ పాత్రను తక్కువ చేయలేం. ఒకవేళ టీమ్ఇండియా టీ10 ఫార్మాట్లో ఆడాలనుకున్నా.. కోహ్లీలాంటి అనుభవమున్న ఆటగాడు అవసరం. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌కు కోహ్లీ వల్లే స్థిరత్వం వచ్చింది. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌.. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లీల కాంబినేషన్‌ గొప్పగా రాణిస్తోంది" అని నెహ్రా(ashish nehra on virat kohli) పేర్కొన్నాడు.

ఇవీ చూడండి:మీ సహకారం చరిత్రలో నిలిచిపోతుంది: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details