తెలంగాణ

telangana

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్​ భార్య.. ఫ్యాన్స్​​కు థ్యాంక్స్​ చెబుతూ లెటర్​!

By

Published : Oct 6, 2022, 12:32 PM IST

టీమ్​ఇండియా ప్లేయర్​ అజింక్యా రహానే భార్య రాధిక.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు రహనే సోషల్ మీడియా ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు. దాంతో పాటు ఫ్యాన్స్​కు థ్యాంక్స్​ చెబుతూ లెటర్​ కూడా పోస్ట్​ చేశాడు.

ajinkya-rahane-radhika-rahane-blessed-with-baby-boy-shares-post-on-twitter
ajinkya-rahane-radhika-rahane-blessed-with-baby-boy-shares-post-on-twitter

భారత క్రికెట్ జట్టు ఆటగాడు అజింక్యా రహానే భార్య రాధిక బుధవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. రహానే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త అందించాడు. రాధిక, ఆమె కుమారుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని రహానే తెలిపాడు.

రహానే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను షేర్ చేశాడు. ఇందులో బుధవారం ఉదయం తన భార్య రాధిక మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. ఈ లేఖ ద్వారా తన అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. "ఈ ఉదయం రాధిక, నేను.. నా మగ బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించాము. రాధిక, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు. మీ అందరీ ప్రార్థనలకు మేము ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చాడు.

రహానే ట్వీట్​

అజింక్యా రహానే సెప్టెంబర్ 2014లో రాధికా ధోపావ్కర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం మరాఠీ సంప్రదాయంలో జరిగింది. మీడియా కథనాల ప్రకారం.. రహానే, రాధిక చిన్ననాటి స్నేహితులు. 2019లో ఈ బిడ్డ కంటే ముందే రాధిక ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.

ఇవీ చదవండి:ఆస్ట్రేలియాకు టీమ్​ఇండియా.. టీ20 వరల్డ్​కప్​ వేటకు రెడీ.. బీసీసీఐ పోస్ట్​ వైరల్​!

లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఛాంపియన్‌గా ఇండియా క్యాపిటల్స్​

ABOUT THE AUTHOR

...view details