ETV Bharat / sports

లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఛాంపియన్‌గా ఇండియా క్యాపిటల్స్​

author img

By

Published : Oct 6, 2022, 8:56 AM IST

Updated : Oct 6, 2022, 9:24 AM IST

Legends League Cricket
india capitals

భారత్‌లో తొలిసారి జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో ఇండియా క్యాపిటల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్​లో 104 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

భారత్‌లో తొలిసారి జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో ఇండియా క్యాపిటల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. రాజస్థాన్​ జైపుర్​లో బుధవారం సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో క్యాపిటల్స్ 104 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

గౌతమ్ గంభీర్ సారథ్యంలోని క్యాపిటల్స్ టీమ్​ ప్రారంభంలో తడబడిన తర్వాత 20 ఓవర్లలో 211/7 స్కోరుతో విజృభించింది. క్యాపిటల్స్​ చేతిలో కింగ్స్‌.... 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. క్యాపిటల్స్ తరఫున ఉన్న ముగ్గురు బౌలర్లు పవన్ సుయాల్ (2/27), పంకజ్ సింగ్ (2/14), ప్రవీణ్ తాంబే (2/19) రెండేసి వికెట్లు తీశారు. గట్టి బౌలింగ్​తో పాటు పదునైన ఫీల్డింగ్‌ బ్యాటింగ్‌కు తోడ్పడింది.

కింగ్స్ ఓపెనర్లు మోర్నే వాన్ వైక్ , విలియం పోర్టర్‌ఫీల్డ్ తొలి నాలుగు ఓవర్లలోనే ఔటయ్యారు. ఇక భారమంతా యూసఫ్ పఠాన్ భుజాలపైన పడిందన్న సమయంలో యూసఫ్​ కొన్ని రన్స్​ తీసి అవుట్​ అయ్యాడు. షేన్ వాట్సన్ రనౌట్ కావడం దురదృష్టకరం కాగా, జెసల్ కరియా ధీటుగా రాణించినా ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. 12వ ఓవర్‌లో కింగ్స్‌ కెప్టెన్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఔట్‌ కాగా, ఛేజింగ్‌ మాత్రం బాగానే సాగింది.

మాంటీ పనేసర్, రాహుల్ శర్మ తమ స్పిన్ ప్రతిభతో క్యాపిటల్స్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. టేలర్, జాన్సన్ కింగ్స్ ద్వయం బరిలోకి దిగి దుమ్మురేపారు. మ్యాచ్ తొమ్మిదో ఓవర్ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌కు కీలక మలుపు. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ టేలర్‌ ఆ ఓవర్‌లో 30 పరుగుల వద్ద యూసుఫ్‌ స్పిన్‌ను చిత్తు చేశాడు. ఆ ఓవర్‌లో అతను నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు.

రాస్ టేలర్ (41 బంతుల్లో 82), మిచెల్ జాన్సన్ (35 బంతుల్లో 62) ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి, క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌కు ఓ కొత్త ములపు తెచ్చారు. కానీ ఇంగ్లండ్ మాజీ పేసర్ టిమ్ బ్రెస్నన్ 15వ ఓవర్లో జాన్సన్‌ను అవుట్ చేశాడు. అయితే అప్పటికి జాన్సన్ ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. 17వ ఓవర్‌లో టేలర్ ఎనిమిది సిక్సర్లు, నాలుగు బౌండరీలు బాదిన తర్వాత ఔట్ అయ్యాడు. ఆష్లే నర్స్ (19 బంతుల్లో 42) డెత్ ఓవర్లలో చక్కటి అతిధి పాత్ర పోషించి క్యాపిటల్స్ స్కోరు 200 దాటించాడు. ఆఖరికి క్యాపిటల్స్​ విజయాన్ని కైవసం చేసుకున్నారు.

ఇదీ చదవండి: 2023 ప్రపంచ కప్​.. నా టార్గెట్: తాత్కాలిక కెప్టెన్‌ ధావన్‌

ఐసీసీ ర్యాంకింగ్స్​లో రెండోస్థానానికి సూర్య.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?

Last Updated :Oct 6, 2022, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.