తెలంగాణ

telangana

2028 Los Angeles Olympics Cricket : ఒలింపిక్స్‌లో క్రికెట్‌ వచ్చేసింది.. మరో 4 క్రీడలకు కూడా చోటు

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 1:44 PM IST

Updated : Oct 16, 2023, 3:15 PM IST

2028 Los Angeles Olympics Cricket : 2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించారు. ఒలింపిక్ కమిటీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. క్రికెట్‌ సహా 5 కొత్త క్రీడలకు చోటు కల్పించినట్లు పేర్కొంది.,

2028 Los Angeles Olympics Cricket : ఒలింపిక్స్‌లో క్రికెట్‌ వచ్చేసింది.. ఆ ఐదు క్రీడలకు కూడా చోటు
2028 Los Angeles Olympics Cricket : ఒలింపిక్స్‌లో క్రికెట్‌ వచ్చేసింది.. ఆ ఐదు క్రీడలకు కూడా చోటు

2028 Los Angeles Olympics Cricket : నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌. ఈ మెగా టోర్నీ అంటే అభిమానుల్లో భారీ అంచనాలు, ఆసక్తి ఉంటాయి. ముఖ్యంగా భారత అథ్లెట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బరిలో దిగుతుంటే.. ఫ్యాన్స్‌ కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. అలాంటి ఈ క్రీడల్లో మళ్లీ క్రికెట్‌ చేర్చబోతున్నట్లు రెండు మూడు రోజుల కిందట అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ముంబయిలో జరిగిన తాజా సమావేశంలో క్రికెట్​ చేర్చే విషయమై ఓటింగ్ నిర్వహించగా.. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ సహా 5 కొత్త క్రీడలకు చోటు కల్పించినట్లు పేర్కొంది. క్రికెట్‌ (టీ20)తో పాటు బేస్‌బాల్‌- సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లక్రాస్‌ (సిక్సస్‌), స్క్వాష్‌లకు కూడా ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించినట్లు చెప్పింది. ఈ విషయాన్ని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ అనౌన్స్​ చేశారు. దీంతో 2028 లాస్‌ఏంజిలెస్‌ ఒలింపిక్స్​లో(2028 Los Angeles Olympics) టీ20 టోర్నీ నిర్వహించనున్నారు.

1900లో ఏం జరిగింది?...1900 ఒలింపిక్స్‌లో మొదటి సారి క్రికెట్‌ నిర్వహించారు. అదే చివరి సారి కూడా. అప్పుడు డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌ (బ్రిటన్‌), ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ (ఫ్రాన్స్‌) మధ్య రెండు రోజుల పాటు మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక్క నేషనల్ ప్లేయర్​ లేడు. ఈ పోరులో జట్టుకు 12 మంది చొప్పున ఆటగాళ్లు ఆడారు. ఈ మ్యాచ్​కు ఫస్ట్‌క్లాస్‌ హోదా కూడా దక్కలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్రిటన్‌ 117 పరుగులు సాధించగా.. ఫ్రాన్స్‌ 78 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్​ను 145/5 వద్ద బ్రిటన్‌ డిక్లేర్‌ చేసింది. ఛేదనలో ఫ్రాన్స్‌ 26 పరుగులకే కుప్పకూలడం వల్ల బ్రిటన్‌ 158 పరుగుల తేడాతో గెలిచింది. అప్పుడు బ్రిటన్‌కు రజతం, ఫ్రాన్స్‌కు కాంస్యం దక్కింది. ఆ తర్వాత వీటిని గోల్డ్​, సిల్వర్​ మెడల్స్​గా మార్చారు.

ODI World cup 2023 England : ఇంగ్లాండ్​ ఖాతాలో చెత్త రికార్డ్​.. ప్రపంచ కప్​ చరిత్రలో తొలి జట్టుగా

ODI World Cup 2023 IND VS PAK : ఆ మజా మళ్లీ దొరకదా?.. భారత్ - పాక్ మ్యాచుల్లో కిక్ ఏది బాసూ!

Last Updated : Oct 16, 2023, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details