ETV Bharat / sports

ODI World cup 2023 England : ఇంగ్లాండ్​ ఖాతాలో చెత్త రికార్డ్​.. ప్రపంచ కప్​ చరిత్రలో తొలి జట్టుగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 12:56 PM IST

ODI World cup 2023 England : వన్డే వరల్డ్ కప్​ 2023లో అక్టోబర్ 15న జరిగిన మ్యాచ్​లో అప్గానిస్థాన్ చేతిలో ఇంగ్లాండ్​ ఘరంగా ఓడిపోయింది. ఈ పరాజయం దిమ్మతిరిగే దెబ్బ అనుకుంటే.. దాంతో పాటు ఇంగ్లాండ్ మరో చెత్త రికార్డును నమోదు చేసుకుంది. అదేంటంటే...

ODI World cup 2023 England : ఇంగ్లాండ్​ ఖాతాలో మరొ చెత్త రికార్డు.. ప్రపంచ కప్​ చరిత్రలో మెుదటి జట్టు
ODI World cup 2023 England : ఇంగ్లాండ్​ ఖాతాలో మరొ చెత్త రికార్డు.. ప్రపంచ కప్​ చరిత్రలో మెుదటి జట్టు

ODI World cup 2023 England : ప్రపంచ కప్​ 2023లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్ ఇంగ్లాండ్​ను చిత్తుగా ఓడించింది ఆప్గానిస్థాన్. ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ ఓటమితో మరొక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచ కప్​ చరిత్రలో అన్ని టెస్ట్ ప్లేయింగ్ జట్ల చేతుల్లో ఓడిన మొదటి టీమ్​గా నిలిచింది. 1975 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్​ల్లో ఏదొక మ్యాచ్​ల్లో 11 జట్ల చేతుల్లో పరాజయం పొందింది. ఇలా అన్ని టీమ్స్​పై ఒక్కసారైన ఓడిపోయిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది.

  • 1975 ప్రపంచ కప్​లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్​ ఓటమిని చవి చూసింది.
  • 1979లో వరల్డ్​కప్​ ఫైనల్లో వెస్టిండీస్​ చేతిలో పరాజయం పొందింది.
  • 1983, 1987 ప్రపంచకప్​ల్లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్​ చేతుల్లో ఓడింది ఇంగ్లాండ్.
  • 1992లో జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
  • 1996లో శ్రీలంక, సౌతాఫ్రికా టీమ్స్​తో తలపడి ఇంగ్లాండ్ ఓడిపోయింది.

2011లో ఐర్లాండ్​ చేతిలో ఇంగ్లాండ్​ ఓటమి పాలైంది.

  • 2015 ఎడిషన్​లో బంగ్లాదేశ్​తో ఓటమిని ఎదుర్కొంది.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్​ 2023లో ఆఫ్గానిస్థాన్ చేతుల్లో ఘోరంగా పరాభవం ఎదురైంది. ఈ ఓటమితో 11 దేశాల జట్టులతో తలపడి పరాజయాన్ని పొందిన దేశంగా ఇంగ్లాండ్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. మొత్తంగా ఈ వరల్డ్ కప్​ 2023లో ఇంగ్లాండ్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ​ ఆడిన మూడింటిలో ఒక మ్యాచ్ మాత్రమే గెలించింది. మొదటి మ్యాచ్​లో న్యూజిలాండ్​పై ఓడగా.. రెండో మ్యాచ్​ బంగ్లాదేశ్​ పై గెలిచింది. మూడో మ్యాచ్​లో అప్గాన్​పై ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

ODI World CUP 2023 AFG VS ENG : ఇకపోతే అప్గాన్​ - ఇంగ్లాండ్​ మధ్య జరిగిన మ్యాచ్​ విషయానికొస్తే.. 69 పరుగులు తేడాతో ఇంగ్లాండ్​ ఓడిపోయింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్​ కాగా.. అనంతరం 285 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్​ 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని అందుకుంది.

ODI World cup 2023 Rashid Khan : నాడు విలన్​.. నేడు హీరో.. డిఫెండింగ్​ ఛాంపియన్​పై అదరగొట్టేశాడు!

ODI WorldCup 2023 AFG VS ENG : జగజ్జేత ఇంగ్లాండ్​కు షాకిచ్చిన ఆప్గానిస్థాన్​.. ప్రపంచకప్​లో సంచలనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.