తెలంగాణ

telangana

Bigg Boss Season 5: మూడో రోజే రచ్చ మొదలైంది..!

By

Published : Sep 7, 2021, 8:45 PM IST

Updated : Sep 7, 2021, 8:53 PM IST

'బిగ్​బాస్​ సీజన్​ 5' మొదలైన మూడో రోజునే రచ్చ మొదలైంది. లోబో-సిరి, జస్వంత్​-అనీ మాస్టర్​ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇందుకు గల కారణమేంటో తెలుసుకోవాలంటే మంగళవారం ప్రసారంకానున్న ఎపిసోడ్​ను చూడాల్సిందే. అంతవరకు ఈ ప్రోమోను చూసేయండి!

bigg boss telugu season 5 september 7 episode promo
Bigg Boss Season 5: లోబో-సిరి, జస్వంత్​-అనీ మధ్య లొల్లి!

బుల్లితెరలో ప్రసారమవుతున్న 'బిగ్​బాస్​ సీజన్​ 5'లో కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది. లోబో-సిరి, జస్వంత్​-అనీ మాస్టర్​ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అయితే ఈ వాగ్వాదానికి కారణమేంటో తెలుసుకోవాలంటే మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్​ ప్రొమోను చూసేయండి.

ఎలిమినేషన్​ షురూ

కింగ్​ నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'. ఇటీవల మొదలైన 'సీజన్‌ 5'లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మొదటివారం ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. తొలి వారానికి జస్వంత్‌, రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదాలు నామినేట్‌ అయ్యారు.

"బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండటానికి అర్హులు కాని ఇద్దరు వ్యక్తుల పేర్లు, అందుకు కారణాలు చెప్పి ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టండి," అని బిగ్‌బాస్‌ సూచించారు. ఈ సందర్భంగా వ్యర్థాలను వేసే కవర్లపై హౌస్‌మేట్స్‌ ఫొటోలు ముద్రించిన బ్యాగులను ఉంచారు. ప్రతి ఒక్కరూ ఇద్దరు కంటెస్టెంట్‌లను ఎంచుకుని వారి ఫొటో ఉన్న బ్యాగును చెత్త డబ్బాలో వేయాలి. అత్యధిక మంది జస్వంత్‌ను నామినేట్‌ చేశారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? ఎవరు హౌస్‌లో కొనసాగతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

ఇదీ చూడండి..బుల్లితెరపై తారల జోరు.. వీక్షకుల్లో హుషారు!

Last Updated :Sep 7, 2021, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details