తెలంగాణ

telangana

విజయ్ దేవరకొండ-సమంత కోసం అనిరుధ్​.. శర్వా సరసన కీర్తి

By

Published : Mar 24, 2022, 7:07 AM IST

Vijay Devarakonda Samantha Movie: కొత్త సినిమా అప్డేట్లు వచ్చేశాయి. మణిరత్నం తెరకెక్కిస్తున్న మాగ్నమ్ ఒపస్​ 'పొన్నియన్​ సెల్వన్-1', విజయ్​ దేవరకొండ-సమంత కొత్త చిత్రం సహా కథానాయిక కీర్తి సురేశ్​​ సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

vijay devarakonda samantha movie
Keerthy Suresh New Movie

Keerthy Suresh New Movie: కొత్త అవకాశాల విషయంలో కీర్తిసురేశ్ హవా కొనసాగుతోంది. ఆమె వరుసగా తెలుగు సినిమాలకి పచ్చజెండా ఊపుతోంది. మహేష్‌బాబుతో కలిసి 'సర్కారు వారి పాట'లో నటిస్తున్న కీర్తి, చిరంజీవి చిత్రం 'భోళాశంకర్‌'లోనూ చెల్లెలి పాత్రలో మెరవనుంది. నాని కథానాయకుడిగా నటిస్తున్న 'దసరా'లోనూ కీర్తినే కథానాయిక.

కీర్తి

దీంతోపాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రం చేయడానికి ఆమె పచ్చజెండా ఊపినట్టు సమాచారం. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో మొదట కృతిశెట్టి పేరు వినిపించింది. తాజాగా కీర్తి ఖరారైనట్టు తెలిసింది. తమిళం, మలయాళంలోనూ నటిస్తున్న ఆమె ఎక్కువ సినిమాలు తెలుగులోనూ చేస్తోంది.

విజయ్​-సామ్​ సినిమా కోసం అనిరుధ్​..

అనిరుధ్

Vijay Devarakonda Samantha Movie: దక్షిణాది అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో అనిరుధ్‌ రవిచందర్‌ ఒకరు. ఆయన తమిళంలో స్టార్‌ కథానాయకుల చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. తెలుగులోనూ ఆయన కొన్ని చిత్రాలకి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. అందులో విజయ్‌ దేవరకొండ - సమంత సినిమా ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా అది. కథ మెచ్చి అనిరుధ్‌ రంగంలోకి దిగినట్టు సమాచారం. తెలుగులో ఇదివరకు 'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. విజయ్‌ సినిమాతోపాటు, ఎన్టీఆర్‌ - కొరటాల శివ, రామ్‌చరణ్‌ - గౌతమ్‌ తిన్ననూరి కలయికలో రూపొందనున్న సినిమాలకీ అనిరుధ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

రెహమాన్​ స్వరాలు..

మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తమిళ చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌-1'. విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, కార్తి, త్రిష, జయం రవి... తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీత సారథ్యం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీత పనులు దుబాయ్‌లో ప్రారంభమయ్యాయని రెహమాన్‌ తెలిపారు. దుబాయ్‌లోని ఫిర్డౌస్‌ స్టూడియోలో మణిరత్నం, తాను సంగీతం పనుల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు.

త్రిష

"అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో వస్తున్న ఈ చిత్రంలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. అందుకే మణిరత్నంను దుబాయ్‌ రప్పించాను. ఇక్కడ ఆయన కాసేపు గోల్ఫ్‌ ఆడటానికి పిలిచినా రాకుండా.. త్వరగా పనులు పూర్తిచేయాలని కష్టపడుతున్నారు" అని రెహమాన్‌ తెలిపారు.

తమిళ రచయిత కల్కీ కృష్ణమూర్తి 1955లో రాసిన నవల 'పొన్నియన్‌ సెల్వన్‌' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో తొలి భాగాన్ని సెప్టెంబరు 30 ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు.

ఇదీ చూడండి:'కేజీఎఫ్​ 2' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు చీఫ్​ గెస్ట్​గా ప్రభాస్​​?

ABOUT THE AUTHOR

...view details