తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' చిత్రంలో ఇతడి నటనకు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ఆ సినిమా విడుదలకాకముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పేశాడు. తాజాగా తన మూడో చిత్రానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం ఈరోజు పూర్తయింది.
గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ చిత్రం
'ఉప్పెన' ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా మరో చిత్రానికి రంగం సిద్ధమైంది. 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించిన గిరీశయ్య డైరెక్షన్లో ఇతడు ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం ఈరోజు జరిగింది.
గిరీశయ్య దర్శకత్వం వైష్ణవ్ చిత్రం.. పూజ పూర్తి
ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించిన గిరీశయ్య డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. కేతికాశర్మ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.