తెలంగాణ

telangana

'అర్జున్​రెడ్డి'​ రీమేక్​ దర్శకుడితో వైష్ణవ్​తేజ్ సినిమా!

By

Published : Mar 27, 2021, 7:30 AM IST

'అర్జున్​రెడ్డి' తమిళ వెర్షన్​కు దర్శకత్వం వహించిన గిరీశయ్యతో వైష్ణవ్​తేజ్ కలిసి పనిచేయనున్నారు. వచ్చే నెలలోనే సినిమా ప్రారంభం కానుంది.

vaishnav tej movie with director gireesaaya
'అర్జున్​రెడ్డి'​ దర్శకుడితో వైష్ణవ్​తేజ్ సినిమా!

తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' తర్వాత పలువురు దర్శకనిర్మాతల చూపు ఆయనపై పడింది. ఇప్పటికే ఆయన రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. అందులో ఒకటి త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ తీసిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఇప్పుడు నటించనున్నారు. బీవీఎస్​ఎన్ ప్రసాద్ నిర్మాత. వచ్చే నెల ఆరంభంలోనే ఆ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇందులో వైష్ణవ్​కు జోడీగా కేతిక శర్మ నటించే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details