తెలంగాణ

telangana

అమితాబ్​తో దీపికా పదుకొణె మూడోసారి?

By

Published : Mar 19, 2021, 8:51 PM IST

అమితాబ్, దీపిక.. ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయనున్నారా? అంటే బాలీవుడ్​ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ సంగతేంటి?

Big B replaces late Rishi Kapoor in Deepika starrer?
అమితాబ్​తో దీపికా పదుకొణె మూడోసారి?

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణెతో మూడోసారి కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వీరిద్దరూ 'పీకూ'లో నటించగా, ప్రభాస్-నాగ్ అశ్విన్​ ప్రాజెక్టులో చేయనున్నారు.

దీపికా పదుకొణె

రిషి కపూర్​ స్థానంలో అమితాబ్

హాలీవుడ్​ హిట్ సినిమా 'ద ఇంటెర్న్'ను హిందీ రీమేక్​ చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. రిషి కపూర్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత కరోనాతో లాక్​డౌన్ పెట్టడం, కొన్నాళ్ల తర్వాత రిషి కపూర్ అనారోగ్యంతో మరణించడం వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఇప్పుడు ఆ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమితాబ్​ను సంప్రదించారట. ఆయన అంగీకారం తెలిపిన వెంటనే సెట్స్​పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details