తెలంగాణ

telangana

'ఆ స్థానంలో నేనుంటే కెరీర్​ నాశనమయ్యేది'

By

Published : Nov 22, 2019, 7:31 PM IST

ప్రముఖ నటి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్​లో దూసుకెళ్తోంది. తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన ఈ భామ.. హిందీ చిత్రపరిశ్రమలో ఓ స్టార్​ హీరో కొడుకుపై కామెంట్​ చేసింది. ఆ యువ నటుడి స్థానంలో తను ఉంటే కెరీర్​ నాశనమయ్యేదని చెప్పింది.

'ఆ హీరో స్థానంలో నేనుంటే కెరీర్​ నాశనమయ్యేది'

చిత్ర పరిశ్రమలో పురుషులకు, మహిళలకు సమానంగా పారితోషకం ఇవ్వట్లేదని గతంలో వ్యాఖ్యలు చేసిన తాప్సీ... తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అనిల్​ కపూర్​ కుమారుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ప్రైవేటు షోలో పాల్గొన్న ఈ నటి.. అనిల్ కొడుకు హర్షవర్థన్ కపూర్‌ను ప్రస్తావిస్తూ ఓ విషయాన్ని చెప్పింది.

తాప్సీ, అనిల్​ కపూర్​, హర్షవర్థన్

" హర్షవర్థన్​ కపూర్ తొలి సినిమా ఫ్లాప్​ అయింది. కానీ రెండో సినిమాలో మళ్లీ అవకాశం వచ్చింది. ఎందుకంటే అతను స్టార్ హీరో కుమారుడు కాబట్టి. అదే స్థానంలో నేను ఉంటే అలా జరగదు. పూర్తిగా కెరీర్​ నాశనమయ్యేది".
-- తాప్సీ, సినీ నటి

అనిల్ కపూర్ కుమారుడు, సోనమ్ కపూర్ సోదరుడైన హర్షవర్ధన్ కపూర్.... 2016 లో రాకేష్ ఓంప్రకాష్ తెరకెక్కించిన 'మిర్జ్యా' సినిమాలో తొలిసారి నటించాడు. ఇది బాక్సాఫీసు వద్ద నిరాశపర్చింది. రెండేళ్ల తర్వాత భవేష్ జోషి తెరకెక్కించిన 'సూపర్ హీరో' చిత్రంలో మళ్లీ అవకాశం వచ్చింది. ప్రస్తుతం అభినవ్ బింద్రా బయోపిక్​లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

హర్షవర్థన్​తో తాప్సీ

ఈ ఏడాది 'బద్లా', 'గేమ్​ ఓవర్'​, 'మిషన్​ మంగల్'​,'శాండ్​ ఖీ ఆంఖ్​' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాప్సీ. ప్రస్తుతం తడ్ఖా, తప్పడ్​ సినిమాలతో బిజీగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details