తెలంగాణ

telangana

నటి సన్ని లియోనీ.. ఆ ఇంటర్ కాలేజీ టాపర్

By

Published : Aug 29, 2020, 6:01 PM IST

ఓ కాలేజీలోని 12వ తరగతి మెరిట్​ జాబితాలో తన పేరు టాప్​లో ఉండటంపై నటి సన్ని లియోనీ ఆశ్చర్యపడింది. వచ్చే సెమిస్టర్​లో అందరినీ కలుస్తానంటూ హాస్యభరిత ట్వీట్ చేసింది.

నటి సన్ని లియోనీ.. ఆ ఇంటర్ కాలేజీ టాపర్
సన్ని లియోనీ

బాలీవుడ్​ నటి సన్ని లియోనీ, కోల్​కతాలోని ఓ ఇంటర్ కాలేజ్ టాపర్​గా నిలిచింది. ఆ జాబితాను కళాశాల యాజమాన్యం పోస్ట్ చేయగా, దానికి ఈ భామ కూడా స్పందించింది. "వచ్చే సెమిస్టర్​లో మీ అందరిని కలుస్తా, మీరు కూడా నా క్లాస్​లో ఉంటారని అనుకుంటున్నాను" అని ట్వీట్ చేసింది.

అసలేం జరిగింది?

కోల్​కతాలోని అషుతోష్ కాలేజీ ప్రకటించిన 12వ తరగతి పరీక్షల మెరిట్​ జాబితాలో సన్ని లియోనీ పేరు తొలి స్థానంలో కనిపించింది. నాలుగు సబ్జెక్టుల్లోనూ నూటి నూరు మార్కులు ఈమెకు వచ్చినట్లు ఇందులో చూపించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. చివరకు ఆమె కూడా ట్విట్టర్​లో స్పందించింది.

అషుతోష్ కాలేజీ 12వ తరగతి ఫలితాల మెరిట్ లిస్ట్

అయితే ఇది ఎవరో ఆకతాయుల చేసిన పని అని చెప్పిన అషుతోష్ కాలేజీ యాజమాన్యం.. సత్వరమే విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details