తెలంగాణ

telangana

'అనామిక'గా సన్నీ లియోనీ.. దర్శకుడు ఎవరంటే?

By

Published : Dec 21, 2020, 9:51 PM IST

ప్రముఖ నటి సన్నీలియోనీ కొత్త సినిమాను ప్రకటించింది. 'అనామిక' కోసం దర్శకుడు విక్రమ్​ భట్​తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.

sunny leone begins shoot for anamika
'అనామిక'గా సన్నీ లియోనీ.. దర్శకుడు ఎవరంటే?

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సంపాదించుకున్న నటి సన్నీ లియోనీ. చివరిగా ఆమె వెండితెరపై 2019లో విడుదలైన హిందీ చిత్రం 'మోతీచూర్‌ చక్నాచూర్‌'లో అతిధి పాత్రలో కనిపించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌కు కుటుంబంతో సహా వెళ్లింది. తాను నటించనున్న కొత్త థ్రిల్లర్‌ చిత్రం 'అనామిక'ను గురించిన విశేషాలను సన్నీ ఆదివారం వెల్లడించింది.

ముంబయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లాప్‌బోర్డును పట్టుకుని ఉన్న చిత్రాలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విక్రమ్‌ భట్‌ దర్శకత్వంలో తొలిసారిగా నటిస్తున్నట్టు ఈమె తెలిపారు.

"సత్‌నామ్‌. లాక్‌డౌన్‌ అంతమవుతున్న సందర్భంలో ఓ కొత్త ప్రారంభం. మంచిగా ఉండే విక్రమ్‌ భట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభం" అంటూ ఆమె రాసుకొచ్చింది.

ప్రముఖ నటి సన్నీ లియోనీ
ప్రముఖ నటి సన్నీ లియోనీ

ABOUT THE AUTHOR

...view details