తెలంగాణ

telangana

హీరోయిన్ సమంత అసలు పేరేంటో తెలుసా?

By

Published : Jan 8, 2021, 6:35 PM IST

స్టార్​ హీరోయిన్ సమంతకు తెరవెనుక ఓ పేరు ఉంది. దాని గురించి ఇప్పటివరకు అభిమానులెవరికి తెలుసుండకపోవచ్చు. ఇంతకీ ఆ పేరు ఏంటంటే?

samantha akkineni's real name is yashoda, isn't she?
హీరోయిన్ సమంత అసలు పేరు

'జెస్సీ'గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత.. తక్కువ సమయంలోనే టాలీవుడ్​ అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసి స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. 2017లో హీరో నాగచైతన్యను వివాహం చేసుకొని, అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. అప్పటి నుంచి సమంత అక్కినేనిగా మారింది. అయితే ఈమె అసలు పేరు సమంత కాదు. సామ్​కు యశోద అనే పేరు కూడా ఉంది.

అయితే ఈ పేరుతో సమంతను.. ఆమె పాఠశాల, కాలేజి స్నేహితులు, పుట్టింట్లో మాత్రమే పిలిచేవారు. దీని గురించి బయట ఎక్కడా తెలియకపోవడం వల్ల ఆమె పేరు సమంత అనే అందరూ భావిస్తున్నారు.

హీరోయిన్ సమంత

ప్రస్తుతం ఈమె తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి 'కాతువక్కల్ రెండు కాదల్' సినిమాలో నటిస్తోంది. తెలుగులో గుణశేఖర్​ 'శాకుంతలం'లో టైటిల్​ రోల్​ పోషిస్తోంది.

ఇది చదవండి:ఆ హీరో కుటుంబం మొత్తం సమంత అభిమానులే

ABOUT THE AUTHOR

...view details