తెలంగాణ

telangana

మహిళా ఆటో డ్రైవర్​కు కారు కొనిచ్చిన సమంత

By

Published : Apr 18, 2021, 7:35 PM IST

తెలుగు సినీ నటి సమంత తన మంచి మనసును చాటుకుంది. గతంలో ఒక పేద మహిళకు ఇచ్చిన మాట ప్రకారం రూ.12.5 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చింది.

Samantha Akkineni,  keeps her promise and gifts a car to a female auto driver
సమంత అక్కినేని, పేద ఆటో డ్రైవర్​కు కారు బహుమతిచ్చిన సమంత

తన నటన చతురతతో సినీ అభిమానులను మెప్పించే నటి సమంత.. ఇప్పుడు దయార్ద్ర హృదయం చాటుకుంది. గతంలో ఒక పేద మహిళకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రస్తుతం నిలబెట్టుకుంది. పేదరికంతో పోరాడుతూ ఆటో నడుపుకుంటున్న ఓ మహిళకు రూ.12.5 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చింది.

ఇదీ చదవండి:రూ. 6.5 కోట్ల సెట్‌లో.. 'శ్యామ్‌ సింగరాయ్‌'

మహమ్మారి వల్ల పేదరికంతో పోరాడుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన కవిత అనే మహిళ ఈ ఏడాది ఆరంభంలో సమంతను కలిసింది. తాను గృహహింసకు గురయ్యానని.. తన తల్లిదండ్రులు చనిపోయినట్లు వెల్లడించింది. మియాపూర్​ నుంచి బాచుపల్లికి ఆటో నడుపుతూ తన ఏడుగురు తోబుట్టువులను పోషించుకుంటున్నట్లు తెలిపింది. ఆ మహిళ కష్టాలు విని చలించిపోయిన నటి.. ఆమెకొక కారును బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చింది. తాజాగా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది సమంత. స్విఫ్ట్​ డిజైర్​ కారును గిఫ్ట్​గా ఇచ్చి మంచి మనసును చాటుకుంది. సమంత చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం నీలిమా గుణ, దిల్​రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లో సమంత నటిస్తోంది.

ఇదీ చదవండి:కేఎల్​ రాహుల్​కు తన ప్రేయసి స్పెషల్ విషెస్!

ABOUT THE AUTHOR

...view details