తెలంగాణ

telangana

అందం విషయంలో భయాలుండేవి: సాయిపల్లవి

By

Published : Oct 24, 2021, 7:11 AM IST

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు భయాలుండేవని సాయిపల్లవి(sai pallavi new movies) చెప్పింది. 'ప్రేమమ్' తర్వాత తన ఆలోచనలు తప్పని అర్థమైనట్లు తెలిపింది.

sai pallavi about her beauty and secrets
సాయిపల్లవి

చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు ఉండేవని హీరోయిన్ సాయి పల్లవి(sai pallavi movie) చెప్పింది. తెరపై సహజంగా కనిపించడానికి ఇష్టపడే ఈ భామ.. అంతే సహజమైన అభినయంతో దక్షిణాదిలో స్టార్‌ నాయికగా తళుకులీనుతోంది. అయితే తొలి సినిమా సమయంలో అందం విషయంలో తన(sai pallavi new age) ఆలోచనలు ఎలా ఉండేవని ప్రశ్నిస్తే... ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

"కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చా. అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో నాకు కొన్ని భయాలుండేవి. ఎందుకంటే అప్పటి వరకు నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్‌ అవుతానా..? తెరపై నన్ను చూసి 'ఈ పిల్ల ఇలా ఉందేంటి?' అని ప్రేక్షకులంటారేమోనని అనుకునేదాన్ని. ఎవరైనా నన్ను చూస్తే.. నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదన పడేదాన్ని. కానీ, 'ప్రేమమ్‌'(premam movie download) విడుదలయ్యాక నా ఆలోచనలన్నీ తప్పని అర్థమైంది. ఎవరైనా క్యారెక్టర్‌నే ఇష్టపడతారు తప్ప.. పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నా. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది" అని సాయిపల్లవి(sai pallavi movies) చెప్పుకొచ్చింది.

సాయిపల్లవి

ఇటీవలే 'లవ్‌స్టోరి'(love story movie) చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన సాయిపల్లవి(sai pallavi husband name).. త్వరలో 'విరాటపర్వం', 'శ్యామ్​సింగరాయ్' సినిమాలతో బాక్సాఫీస్‌ ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details