తెలంగాణ

telangana

'ఆచార్య'లో తన రోల్​పై రామ్​ చరణ్​ క్లారిటీ

By

Published : Sep 15, 2020, 3:54 PM IST

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్​ చరణ్​ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు చరణ్.

Ram Charan clarity about Guest role in Acharya movie
'ఆచార్య'లో రోల్​పై రామ్​ చరణ్​ క్లారిటీ

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా 'సైరా' చిత్రం తీసి, తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి కలను నిజం చేశారు రామ్‌ చరణ్‌. ఇప్పుడు తన తల్లి సురేఖ కల నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు.

చిరు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో దాదాపు 30 నిమిషాల నిడివిగల అతిథి పాత్ర ఉందని, అందులో రామ్​చరణ్​ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రశ్న తాజాగా ఓ ఆంగ్ల పత్రిక చరణ్‌ను అడిగింది. దీనికి చెర్రీ స్పందించారు.

"స్టార్‌డమ్‌, ప్రేక్షకుల అభిమానం.. ఇవన్నీ మా నాన్న వల్ల నాకు వచ్చినవే. అలాంటి ఆయనతో కలిసి వెండితెరను పంచుకోవడం నా అదృష్టం. 2015లో నేను నటించిన 'బ్రూస్‌లీ' చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. అదేవిధంగా 'ఖైదీ నెంబర్‌ 150'లోని పాటలో నేను నాన్నతో కలిసి స్టెప్పులేశా. ఇప్పుడు 'ఆచార్య'లో మళ్లీ కలిసి తెరపై కనిపిస్తాం."

-చరణ్, సినీ హీరో

అనంతరం తన తల్లి సురేఖ కోరిక గురించి ముచ్చటిస్తూ.. "నేను, నాన్న కలిసి తెరపై పూర్తిస్థాయి పాత్రల్లో కనిపించాలనేది మా అమ్మ కల. 'ఆచార్య'లో మా కాంబినేషన్‌ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా" అని చెర్రీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details