బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతోన్న నటి రాఖీ సావంత్ తల్లికి ఆర్థిక సాయం చేశారు. ఈ విషయమై సల్మాన్‌తో పాటు ఆయన సోదరుడుకు సోహైల్ ఖాన్‌కు ఆమె ధన్యావాదాలు తెలిపారు. తన తల్లి మాట్లాడిన వీడియోను సావంత్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
సల్మాన్ లాంటి సోదరుడు తమకు దొరకడం దేవుడి ఆశీర్వాదం అని రాఖీ సావంత్ అన్నారు. రాఖీ సావంత్ ఇటీవల జరిగిన హిందీ బిగ్‌బాస్ 14లో పాల్గొనగా.. రూ.14 లక్షల మొత్తంతో షో నుంచి బయటకు వచ్చింది.
ఇదీ చూడండి:కృష్ణ జింకల కేసులో సల్మాన్‌కు కాస్త ఉపశమనం