తెలంగాణ

telangana

Jai bhim real story: రియల్ రాజన్న భార్యకు ఇల్లు.. లారెన్స్ హామీ

By

Published : Nov 8, 2021, 10:46 PM IST

'జై భీమ్' రియల్ రాజన్న భార్యను ఆదుకునేందుకు కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్​ ముందుకొచ్చారు. ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు.

Jai bhim real story
లారెన్స్ పార్వతి

'జై భీమ్' సినిమా చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అందులో ఉన్నది బయట జరిగిందని తెలియగానే అయ్యో పాపం అని అనుకున్నారు. సినతల్లికి అలా జరిగిందా అంటూ బాధపడ్డారు. కానీ కొరియోగ్రాఫర్ లారెన్స్ మాత్రం ఒకడగు ముందుకేసి తనకు తోచిన సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. 'జైభీమ్' చిత్రబృందానికి ప్రశంసలతో పాటు రియల్ రాజన్న భార్య పార్వతికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.

తమిళనాడులోని ఇరులర్ తెగకు చెందిన రాజకన్ను.. పోలీస్ కస్టడీలోనే మరణించారు. అయితే అతడు ఏ నేరం చేయకుండానే పోలీసులు అరెస్టు చేశారని తర్వాత తేలింది. ఈ కథ ఆధారంగానే 'జై భీమ్' సినిమా తీశారు. సూర్య, మణికందన్, లిజో మోల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details