తెలంగాణ

telangana

Madhavan: 'రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ను చూస్తే అసూయ కలుగుతోంది'

By

Published : Jan 4, 2022, 11:04 PM IST

Madhavan: 'ఆర్​ఆర్​ఆర్'​లోని 'నాటు నాటు' పాటలో ఎన్టీఆర్​-చరణ్ స్టెప్పులకు ఫిదా అయ్యారు ప్రముఖ నటుడు ఆర్​. మాధవన్. తారక్-చెర్రీల స్నేహం చూస్తుంటే తనకు అసూయ కలుగుతోందని తెలిపారు.

Madhavan
rrr

Madhavan: రామ్‌ చరణ్‌ - ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కిన మల్టీ స్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో 'నాటు నాటు' పాట గతేడాది నవంబర్‌లో విడుదలైంది. ఈ పాటలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి వేసిన కొన్ని స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ స్టెప్పులకు ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ కూడా ఫిదా అయ్యారు. ఆ పాటలోని స్టెప్పులను ఎడిట్‌ చేసిన వీడియోను ఇటీవలే ట్విట్టర్‌లో పోస్టు చేసి.. వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించారు.

మాధవన్ ట్వీట్

"ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం.. సమన్వయం నాలో ఈర్ష్య పుట్టేలా చేస్తున్నాయి. నాకు అసూయ కలుగుతోంది. అయినా, మీరిద్దరి పట్ల గర్వంగా ఉంది. హ్యాట్సాఫ్‌" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. మ్యాడీ ట్వీట్‌కు స్పందించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్.. 'థ్యాంక్యూ మ్యాడీ సర్‌' అంటూ సమాధానం ఇచ్చింది.

తారక్-చరణ్

తన ట్వీట్‌కు స్పందించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీంను ఉద్దేశిస్తూ మ్యాడీ "భారత్‌లో బాక్సాఫీస్‌ కలెక్షన్లను మీరు తిరిగి రాయబోతున్నారు" అంటూ మరో ట్వీట్‌ చేశారు. వెంటనే "మేము సిద్ధంగా ఉన్నాం. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం సర్! దేశంలోని థియేటర్ సమస్యలను అతి త్వరలో అధిగమిస్తామని ఆశిస్తున్నాము!" అంటూ మ్యాడీ ట్వీట్‌కు స్పందించింది చిత్రబృందం.

రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 7న ఈ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం.. థియేటర్ల మూసివేత తదితర కారణాలతో విడుదల వాయిదా పడింది. తదుపరి విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు. మరి వేసవి సందర్భంగా సినిమాని విడుదల చేస్తారా? పరిస్థితులు అనుకూలిస్తే అంతకుముందే విడుదల చేస్తారా? అనేది చూడాలి.

ABOUT THE AUTHOR

...view details