తెలంగాణ

telangana

సెట్​లో ప్రభాస్ అలా ఉంటాడు: పూజా హెగ్డే

By

Published : Apr 2, 2020, 10:20 AM IST

డార్లింగ్ ప్రభాస్​,​ పూజా హెగ్డే జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్​లో ప్రభాస్ ఎలా ఉంటాడనే ఆసక్తికర విషయాన్ని చెప్పిందీ భామ.

PRABHAS HAS NOT SILENT IN SHOOTING TIMES: POOJA HEGDE
ప్రభాస్​, పూజాహెగ్డే

టాలీవుడ్ స్టార్​ ప్రభాస్‌.. సినిమా సెట్‌లో నిశ్శబ్దంగా ఉండరని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పింది. వీరిద్దరు ప్రస్తుతం ఓ పీరియాడికల్ కథతో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే జార్జియా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. ఈ చిత్ర విశేషాలను, ప్రభాస్ గురించి ముచ్చటించింది.

'లాక్‌డౌన్‌ కన్నా ముందే భారత్‌కు తిరిగి రావడం మా అదృష్టం. జార్జియాకు వెళ్లే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. కరోనా నేపథ్యంలో వీలైనంత తొందరగా ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో షూటింగ్‌ను ముందుగానే ముగించుకున్నాం. అక్కడి నుంచి ఇంటికి రాగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా. సెట్‌లో ప్రభాస్‌ చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. ఆయనతో కలిసి షూటింగ్‌ చాలా చక్కగా ఉంటుంది'

- పూజా హెగ్డే, సినీ నటి

సల్మాన్​ సరసన

సల్మాన్‌ ఖాన్‌ నటించబోతున్న 'కబీ ఈద్‌ కబీ దివాళి'లో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తుంది. 'ఈ సినిమా చర్చల దశ ముగిసిన తర్వాత, నన్ను తీసుకున్నారని సమాచారం వచ్చింది. ఎంతో సంతోషంగా అనిపించింది. సల్మాన్‌తో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా' అని పూజా చెప్పింది.

ఇదీ చదవండి:'ప్రస్తుతం నేను ఏ సినిమా చేయడం లేదు'

ABOUT THE AUTHOR

...view details