తెలంగాణ

telangana

'భీమ్లానాయక్' ట్రీట్​..​ 'లాలా భీమ్లా' సాంగ్​ అదిరింది​

By

Published : Nov 7, 2021, 11:34 AM IST

Updated : Nov 7, 2021, 11:58 AM IST

'భీమ్లానాయక్'​ సినిమాలోని 'లాలా భీమ్లా'(bheemla naik latest song) సాంగ్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో పవన్​ కల్యాణ్​, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

bheem
భీమ్లానాయక్​

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భీమ్లానాయక్‌'​(rana pawan kalyan movie cast). ఈ సినిమాలోని 'సౌండ్‌ ఆఫ్‌ భీమ్లానాయక్‌'(Sound Of Bheemla Nayak) పేరుతో విడుదలైన 'లాలా భీమ్లా' పూర్తి సాంగ్​ అభిమానుల్ని అలరిస్తోంది.

'లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి' అంటూ సాగే పాట సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను తెలియజేసేలా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ పాటను రచించారు. సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు అందించగా అరుణ్ కౌండిన్య పాటను మరింత పవర్‌ఫుల్‌గా ఆలపించారు. విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ పాట ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' రీమేక్‌గా 'భీమ్లానాయక్‌' సిద్ధమవుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అహం, ఆత్మాభిమానం.. అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌కల్యాణ్‌.. భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే రానా.. డేనియల్‌ శేఖర్‌గా అలరించనున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌, రానాకు జోడీగా సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది(pawan kalyan rana movie release date). ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్పెషల్‌ వీడియోలు, పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి.

పవన్​.. ఈ చిత్రంతో పాటు హరిహర వీరమల్లు, హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.


ఇదీ చూడండి:'భీమ్లానాయక్'​ నుంచి అదిరిపోయే అప్డేట్​

Last Updated : Nov 7, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details