తెలంగాణ

telangana

తారక్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ 'చౌడప్పనాయుడు'?

By

Published : Jan 11, 2021, 6:50 AM IST

యంగ్​టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్​పై ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

NTR-Trivikram new movie title as Choudappa Naidu
తారక్-త్రివిక్రమ్ మూవీ

పెద్ద హీరోల సినిమాలు ప్రకటించడమే ఆలస్యం.. టైటిల్‌ నుంచి మొదలుపెట్టి నటీనటులు.. కథ.. క్లైమాక్స్‌ ఇలా అన్ని విషయాల్లోనూ ఏవేవో ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పరిస్థితి కూడా ఇలాంటిదే. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' పనుల్లో బిజీగా ఉన్న తారక్ తర్వాతి చిత్రం త్రివిక్రమ్‌తో కలిసి చేయనున్నారు. అయితే.. వీళ్ల కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తప్పితే ఎలాంటి వివరాలను చిత్రబృందం ప్రకటించలేదు.

ఆ మధ్య 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అదే 'చౌడప్పనాయుడు'. ఈ టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోందని ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే దర్శకనిర్మాతల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

ఈ సినిమాకు సంబంధించిన పనులు తర్వలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణలో ఉన్నారు తారక్‌. ఆ సినిమా పూర్తవగానే త్రివిక్రమ్‌తో కలిసి పని ప్రారంభించనున్నారట.

ABOUT THE AUTHOR

...view details