తెలంగాణ

telangana

ఆదిత్య మ్యూజిక్​ నిర్మాణంలో కల్యాణ్​రామ్​ చిత్రం

By

Published : Jun 21, 2019, 9:31 AM IST

హీరో కల్యాణ్​రామ్.. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. మెహరీన్ హీరోయిన్​గా కనిపించనుంది. జులై 24 నుంచి షూటింగ్ మొదలవుతుంది.

కుటుంబ కథా చిత్రంలో కల్యాణ్​రామ్

నందమూరి కథానాయకుడు కల్యాణ్​రామ్.. కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆదిత్య మ్యూజిక్​ సంస్థ ఈ చిత్రంతో తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.

కల్యాణ్​రామ్​తో చిత్రబృందం

మెహరీన్ హీరోయిన్. 'శతమానం భవతి'తో ఆకట్టుకున్న సతీశ్ వేగేశ్న దర్శకుడు. గోపీ సుందర్ సంగీతాన్ని అందించనున్నాడు. జులై 24 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించానున్నారు. ఇటీవలే '118' చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కల్యాణ్ రామ్.. ఇప్పుడు కుటుంబ కథతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇది చదవండి: హీరోయిన్లను ఎత్తుకోవడం.. అతడికే చెల్లుతుంది

ABOUT THE AUTHOR

...view details