తెలంగాణ

telangana

Balakrishna B'day: 'ఒక్క అభిమాని దూరమైనా భరించలేను'

By

Published : Jun 7, 2021, 4:28 PM IST

బర్త్​డే రోజున తనను చూసేందుకు, కలిసేందుకు రావొద్దని అగ్రకథానాయకుడు బాలకృష్ణ అభిమానుల్ని కోరారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.

balakrishna birthday message to his fans
బాలకృష్ణ

జూన్ 10న పుట్టినరోజు సందర్భంగా తనను చూసేందుకు అభిమానులెవరూ రావొద్దని నటసింహం నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఒక్క అభిమాని దూరమైనా తాను భరించలేనని, తమ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదని ఫేస్​బుక్​లో పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం బాలయ్య చేస్తున్న 'అఖండ' పోస్టర్​తో పాటు కొత్త ప్రాజెక్టుల గురించి ఆయన పుట్టినరోజున ప్రకటన వచ్చే అవకాశముంది. వీటికోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

బాలకృష్ణ ఫేస్​బుక్ పోస్ట్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details