తెలంగాణ

telangana

'వాలంటైన్స్​ డే' కానుకలతో నాని, అఖిల్

By

Published : Feb 13, 2021, 12:04 PM IST

ప్రేమికుల దినోత్సవానికి రోజు ముందుగా తమ సినిమాల్లో పాటల్ని విడుదల చేశారు హీరోలు నాని, అఖిల్. దీనితో పాటు పలు చిత్రాల కొత్త సంగతులు కూడా ఉన్నాయి.

movie updates from Tuck jagadish, Most eligible bachelor
'వాలంటైన్స్​ డే' కానుకలతో నాని, అఖిల్

*నాని 'టక్ జగదీష్' నుంచి ఇంకోసారి ఇంకోసారి అంటూ సాగుతున్న తొలి లిరికల్ గీతం విడుదలైంది. తమన్ సంగీతమందించారు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లు. శివ నిర్వాణ దర్శకుడు. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

*అఖిల్-పూజా హెగ్డేల 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' నుంచి 'గుచ్చి గుచ్చి' లిరికల్ సాంగ్ విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

*అజయ్ దేవ్​గణ్ 'మైదాన్' సినిమా చివరి షెడ్యూల్​ ఆదివారం(ఫిబ్రవరి 14) నుంచి ముంబయిలో మొదలు కానుంది. ఫుట్​బాలర్ బయోపిక్​గా దీనిని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 15న థియేటర్లలో విడుదల కానుంది.

అజయ్ దేవ్​గణ్ మైదాన్ సినిమా

*'గమనం' సినిమా మార్చి 19న, ప్లేబ్యాక్ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించాయి చిత్రబృందాలు.

గమనం మూవీ రిలీజ్
ప్లేబ్యాక్ సినిమా మూవీ రిలీజ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details