తెలంగాణ

telangana

'మా' అధ్యక్ష ఎన్నికలపై మంచు విష్ణు మరో లేఖ

By

Published : Jul 12, 2021, 7:10 PM IST

'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్న హీరో మంచు విష్ణు.. మరో లేఖ విడుదల చేశారు. ఎలక్షన్స్​ను ఏకగ్రీవం చేస్తే తాను బరిలో ఉండనని పేర్కొన్నారు.

manchu vishnu letter on MAA elections
మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల బరిలో ఉన్న హీరో మంచు విష్ణు మరో లేఖ రాశారు. ఈ ఎలక్షన్స్​ను ఏకగ్రీవం చేయాలని కోరారు. అలా చేస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని పేర్కొన్నారు. లేని పక్షంలో బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ప్రతిసారి ఎన్నికల్లో 'మా' భవనం ప్రధాన అజెండా అవుతోందని విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సెప్టెంబరులో జరగబోయే 'మా' ఎన్నికల బరిలో మంచు విష్ణుతో పాటు ప్రకాశ్​రాజ్, జీవిత, హేమ, సీవీఎల్ నర్సింహరావు ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్​రాజ్ తన ప్యానెల్​ను ప్రకటించారు.

'మా' అభివృద్ధే నినాదంగా అందరూ బరిలోకి దిగుతుండటం వల్ల ఫిల్మ్‌ నగర్‌వైపే అందరి దృష్టి ఉంది. ఈ వాడివేడి పోటీలో ఎవరి సపోర్ట్‌ ఎవరికి ఉందో.. ఎవరు ఎన్నికల బరిలో గెలుపొందుతారో.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details