తెలంగాణ

telangana

నాగబాబు వాట్సాప్​ డీపీలో హీరో బాలకృష్ణ!

By

Published : Apr 15, 2021, 7:11 AM IST

Updated : Apr 15, 2021, 7:30 AM IST

మెగా బ్రదర్​ నాగబాబు గత కొన్ని రోజులుగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానమిస్తున్నారు. మీ వాట్సాప్​ డీపీ ఏంటని ఇటీవలే ఓ నెటిజన్​ అడగ్గా.. బాలయ్య, దర్శకుడు ఆర్జీవీ ఫొటోను నాగబాబు షేర్​ చేశారు.

Hero Balakrishna photo in Nagababu whatsapp dp
నాగబాబు వాట్సాప్​ డీపీలో హీరో బాలకృష్ణ!

రామ్‌గోపాల్‌ వర్మ, నందమూరి బాలకృష్ణ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఓ ఫొటోను తన వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్నట్లు మెగా బ్రదర్​ నాగబాబు తెలిపారు. గత కొన్నిరోజుల నుంచి ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో ముచ్చటిస్తున్న నాగబాబు.. ఇటీవలే మరోసారి 'Ask Me A Question' పేరుతో సరదా సంగతులు పంచుకున్నారు.

ఇందులో భాగంగా ఓ నెటిజన్‌.. 'మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?' అని ప్రశ్నించగా.. తనది పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా న్యూజిలాండ్‌ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని అన్నారు. అనంతరం అల్లు అర్జున్‌ గురించి స్పందిస్తూ.. తన వరకూ బన్నీకి స్టైలిష్‌స్టార్‌ ట్యాగ్‌ బాగుంటుందన్నారు. అలాగే, సాయిధరమ్‌ తేజ్‌.. అమాయకుడు, కష్టపడే గుణం కలిగిన వ్యక్తి అని నాగబాబు సమాధానమిచ్చారు.

ఇదిలా ఉండగా ఓ నెటిజన్‌.. 'మీ వాట్సాప్‌ డీపీ ఏమిటి?' అని ప్రశ్నించగా.. రామ్‌గోపాల్‌వర్మ, బాలకృష్ణ కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు. అయితే, గతంలో ఓ సందర్భంలో నాగబాబు.. ఆర్జీవీ, బాలకృష్ణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాగబాబు.. తన వాట్సాప్‌ డీపీ గురించి వ్యంగ్యంగా సమాధానమిచ్చారా? లేక నిజమే చెప్పారా! అని అందరూ చెప్పుకుంటున్నారు.

ఇన్​స్టాగ్రామ్​లో నాగబాబు షేర్​ చేసిన ఫొటో

ఇదీ చూడండి:మాయదారి కరోనా.. సినిమాల వాయిదాల కలవరం!

Last Updated :Apr 15, 2021, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details