తెలంగాణ

telangana

'మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి'

By

Published : Mar 28, 2020, 6:05 PM IST

మద్యం​ అమ్మకాలకు సాయంత్రమైనా అనుమతివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఓ ట్వీట్​ చేశాడు బాలీవుడ్​ సీనియర్ నటుడు రిషి కపూర్​. పూర్తిగా మూసివేయడం వల్ల బ్లాక్​ మార్కెట్​ పెరిగిపోతుందని వెల్లడించాడు.

Govt should open liquor stores in evenings during lockdown: Rishi Kapoor
'సాయంత్రమైనా మద్యం అమ్మకానికి అనుమతివ్వండి'

కరోనా ప్రభావంతో ప్రస్తుతం దేశమంతా లాక్​డౌన్​ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం సాయంత్రమైనా వైన్​ షాపులకు అనుమతివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ట్విట్టర్​ వేదికగా కోరాడు బాలీవుడ్​ సీనియర్ నటుడు రిషి కపూర్.

"లైసెన్స్​ ఉన్న బార్​, వైన్​ షాపులకైనా అనుమతిస్తే బాగుండేది. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఇప్పటికే బ్లాక్​ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎక్సైజ్​ శాఖ నుంచి వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం. ప్రస్తుతం సమాజంలో అందరూ మద్యం సేవిస్తున్నందున ఇది చట్టబద్దమైనదేనని నా అభిప్రాయం."

- రిషి కపూర్​, బాలీవుడ్​ సీనియర్​ నటుడు

రిషి కపూర్​ వ్యాఖ్యలను అంగీకరిస్తూ కునాల్​ కోహ్లీ స్పందించాడు. 'అదీ కుదరని పక్షంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకైనా లిక్కర్​ దుకాణాలు తెరిచి ఉంచితే బాగుంటుంది' అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ పోస్ట్​పై పలువురు నెటిజన్లు స్పందించారు. మద్యం వల్ల సమాజంలో మహిళలను వారి భర్తలు హింసకు గురిచేస్తున్నారని తెలిపారు. లాక్​డౌన్​ సమయంలో ఇలాంటి చర్యలు అవసరమంటారా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి..'చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా..!'

ABOUT THE AUTHOR

...view details