తెలంగాణ

telangana

టాలీవుడ్​లో వాట్సప్​ వాడని దర్శకుడెవరో తెలుసా?

By

Published : Apr 13, 2021, 9:29 AM IST

ప్రేమకథా చిత్రాల దర్శకుడు శేఖర్​ కమ్ముల.. తన మొబైల్​లో వాట్సప్​ వాడరట! ఈ విషయాన్ని హీరో రానా వ్యాఖ్యాతగా ఆహాలో ఓటీటీలో ప్రసారమవుతోన్న 'నంబర్​వన్​ యారి' కార్యక్రమంలో వెల్లడించారు. 'లవ్​స్టోరి' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా హీరో నాగచైతన్య, సాయిపల్లవి ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Shekhar Kammula Has not using Whatsapp
టాలీవుడ్​లో వాట్సప్​ వాడని దర్శకుడెవరో తెలుసా?

ఈరోజుల్లో వాట్సాప్‌ వాడని వాళ్లు ఉంటారా..? అసలు వాట్సాప్‌ లేకుండా ఏదైనా పని జరుగుతుందా..? ముఖ్యంగా సినిమా డైరెక్టర్‌కే వాట్సాప్‌ లేకపోతే..! అయితే వాట్సాప్‌ లేకపోయినా ఏం ఫరవాలేదంటున్నారు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. అవును.. ఆయన ఇప్పటికీ వాట్సాప్‌ వాడటం లేదట. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో ప్రసారమయ్యే 'నంబర్‌వన్‌ యారి' కార్యక్రమంలో 'లవ్‌స్టోరి' చిత్రబృందం పాల్గొంది. డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల, హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయిపల్లవి సందడి చేశారు.

ఈ సందర్భంగా శేఖర్‌కమ్ములను ఉద్దేశిస్తూ.. మీరూ లవ్‌ ఎమోజీ ఎప్పుడు వాడారని రానా అడగ్గా వెంటనే చైతూ కల్పించుకొని.. 'అసలు శేఖర్‌గారికి వాట్సాప్‌ లేదు. వాట్సాప్‌ మెసెజ్‌కు రిప్లై ఇవ్వరని ఆయనను చాలామంది అపార్థం చేసుకుంటున్నారు' అని చెప్పాడు. అయితే తాను కూడా వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటా శేఖర్‌ కమ్ముల అనబోతుండగా.. మళ్లీ చైతూ కల్పించుకొని 'వద్దు శేఖర్‌ మీరు ఇలాగే ఉండండి' అనడం వల్ల కార్యక్రమంలో నవ్వులు పూశాయి. అయితే.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'లవ్‌స్టోరి' ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది.

ఇదీ చూడండి:హాలీవుడ్​లో మెరిసిన భారతీయ నటులు వీరే!

ABOUT THE AUTHOR

...view details