తెలంగాణ

telangana

అప్పుడు మా దగ్గర రూ.50 వేలు లేవు: ఛార్మి

By

Published : Sep 28, 2019, 7:32 PM IST

Updated : Oct 2, 2019, 9:19 AM IST

హైదరాబాద్​లో దర్శకుడు పూరీ జగన్నాథ్​ జన్మదిన వేడుకలను నిర్వహించింది నటి ఛార్మి. ఇబ్బందుల్లో ఉన్న 30 మంది దర్శకులు, సహాయ దర్శకులకు 'హెల్పింగ్ హ్యాండ్' తరఫున ఆర్థిక సహాయం చేసింది.

అప్పుడు మా దగ్గర రూ.50 వేలు లేవు: ఛార్మి

హైదరాబాద్​లో దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు వేడుకలు

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు వేడుకలను బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్​లో ఘనంగా నిర్వహించింది నటి ఛార్మి. ఈ సందర్భంగా 'హెల్పింగ్‌ హ్యాండ్‌' పేరుతో దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 30 మందికి రూ.50 వేల చొప్పున రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

దర్శకత్వ శాఖలో 30 మందికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్న ఛార్మి

పూరీ ఇచ్చిన ధైర్యంతోనే 'ఇస్మార్ట్‌ శంకర్‌' ప్రారంభించనట్లు ఛార్మి చెప్పింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారయణ రావుతో పూరీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుందీ నటి. వీటితో పాటే ఇతర విషయాలను పంచుకుందీ భామ. ఈ సినిమాకు ముందు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని... 50వేల రూపాయలు కూడా చేతిలో లేవని చెప్పుకొచ్చింది ఛార్మి.

నా దృష్టిలో నిజమైన విజయమదే: పూరీ

అనంతరం పూరీ జగన్నాథ్ పంపిన వాయిస్‌ ఆడియోను వినిపించింది ఛార్మి. అందులో పూరీ.. 'మనమంతా ఏదో సాధించాలని పరుగులు తీస్తుంటాం, తపన పడుతుంటాం. అయితే కొందరు స్టార్స్‌ అవుతారు, కొందరు కాలేరు. అంతమాత్రాన వాళ్లు సక్సెస్‌ అయినట్లు, మీరు ఫెయిల్‌ అయినట్లు కాదు. నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా.. దాని కోసం చావడమే నా దృష్టిలో నిజమైన విజయం' అని సందేశం ఇచ్చాడు.

ఇది చదవండి: పూరీ మంచి స్నేహితుడు: ఛార్మి

RESTRICTIONS: SNTV clients only. No access France. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Shizuoka Stadium, Shizuoka, Japan. 27th September, 2019.
+++SHOTLIST TO FOLLOW+++
SOURCE: IMG Media
DURATION: 01:38
STORYLINE:
Japan shook up the Rugby World Cup with another seismic result in beating Ireland 19-12 on Saturday.
Finding Ireland vulnerable on the edges, and employing suffocating line speed that checked the Irish attack, Japan pulled off an even bigger surprise than their famed upset of South Africa in the 2015 World Cup in Brighton, England.
Last Updated :Oct 2, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details