తెలంగాణ

telangana

వాన పాట - కె.రాఘవేంద్రరావు డైరెక్షన్.. డెడ్లీ కాంబినేషన్!

By

Published : May 23, 2021, 12:07 PM IST

స్టార్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినిమాలో వాన పాట అంటే ప్రేక్షకులు ఎగిరి గంతేస్తారు. అంతా అద్భుతంగా ఆయన వాటిని చిత్రీకరిస్తారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా అలాంటి వాన పాటల్లో కొన్ని మీకోసం.

director K.Raghavendra rao rain songs news
డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు

ప్రస్తుత ఓటీటీ తరంలో ప్రేక్షకుడు.. థ్రిల్లర్, హారర్​, కామెడీతో పాటు అన్ని రకాల సినిమాలు చూస్తూ గడిపేస్తున్నాడు. అయితే చిత్రంలో పాటల్ని మాత్రం దాదాపుగా స్కిప్ చేసేస్తున్నాడు. అయితే పాటను ఎంతో అందంగా తీయొచ్చని, ప్రేక్షకుడు మైమరిపోయాలే విజువల్స్​తో మాయ చేయొచ్చని చాలామంది దర్శకులు నిరూపించారు. అందులో మొదటివరుసలో ఉంటారు స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు.

ఆయన సినిమాల్లో కమర్షియల్​ హంగులు, సెంటిమెంట్ సన్నివేశాలతో పాటూ వాన పాటలు చాలా గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న నాలుగు వాన గీతాలు మీకోసం.

ఎన్టీఆర్ 'వేటగాడు'

ఈ సినిమాలో 'ఆకుచాటు పిందె తడిసె.. కొమ్మ చాటు పువ్వు తడిసే.. ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది' అంటూ సాగే వాన పాట.. అప్పట్లో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. ఎన్టీరామారావు, శ్రీదేవితో వేసిన స్టెప్పులు.. థియేటర్లలో ఈలలు వేయించి, గోలగోల చేసేలా చేశాయి.

చిరంజీవి 'అడవిదొంగ'

ఈ చిత్రంలో 'వాన వాన వందనం' అంటూ ఫాస్ట్​బీట్​తో సాగే పాట.. చిరు అభిమానులతో పాటు సంగీత ప్రియుల్ని అలరించింది. ఇందులో చిరంజీవి-రాధ వేసిన స్టెప్పులు, విజువల్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి.

నాగార్జున 'ఆఖరిపోరాటం'

అతిలోక సుందరి శ్రీదేవితో దాదాపు 24 సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. ఈయన దర్శకత్వంలో ఆమె చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకుల్ని అలరించింది. అయితే నాగార్జున, శ్రీదేవి 'ఆఖరి పోరాటం'లో వాన పాట, శ్రోతల్ని ఆకట్టుకునేలా రాఘవేంద్రరావు రూపొందించారు. 'స్వాతి చినుకు' అంటూ సాగే ఈ గీతం మీరు మరోసారి చూసేయండి.

చిరంజీవి 'ఘరానా మొగడు'

మెగాస్టార్ చిరంజీవి కెరీర్​లో 'ఘరానా మొగుడు' సూపర్​హిట్ చిత్రం. అందులోని ప్రతి పాట అద్భుతమే. మరీ ముఖ్యంగా 'కిటుకులు తెలిసినా' అంటూ సాగే వాన పాట అయితే ప్రేక్షకుల్ని వర్షంలో తడిసి ముద్దయ్యేలా చేసింది. ఇందులో చిరు-వాణీ విశ్వనాథ్ వేసిన స్టెప్పులు ఇప్పుటికీ అలరిస్తూనే ఉన్నాయంటే మనం అర్ధం చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details