తెలంగాణ

telangana

MAA Elections: వారికి మద్దతిస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అన్నాడు!

By

Published : Oct 7, 2021, 11:24 AM IST

'మా' ఎన్నికల(MAA Elections 2021)కు సంబంధించిన 'ఆర్​ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి చేసిన ఓ ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. 'మా' ఎన్నికల్లో తనకు నచ్చిన ప్యానెల్‌ సభ్యులకు ఓటు వేసిన వారికే తదుపరి సినిమాల్లో క్యారెక్టర్లు రాస్తానంటూ ఆ దర్శకుడు చెప్పినట్లు అజయ్‌ భూపతి పేర్కొన్నారు.

Ajay Bhupathi
అజయ్ భూపతి

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల(MAA Elections 2021) వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ప్రకాశ్‌రాజ్‌(prakash raj panel), మంచు విష్ణు ప్యానెల్స్‌(manchu vishnu panel) మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరో మూడు రోజుల్లో జరగనున్న 'మా' ఎన్నికలను సినీ పరిశ్రమలోని సభ్యులందరూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. దీంతో 'మా' ఎన్నికలపై ఎవరేమి స్పందించినా సరే అది కాస్త సంచలనం అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ దర్శకుడు అజయ్‌ భూపతి చేసిన సరికొత్త ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఓ దర్శకుడితో మాట్లాడానని.. 'మా' ఎన్నికల్లో(MAA Elections 2021) తనకు నచ్చిన ప్యానెల్‌ సభ్యులకు ఓటు వేసిన వారికే తదుపరి సినిమాల్లో క్యారెక్టర్లు రాస్తానంటూ ఆ దర్శకుడు చెప్పినట్లు అజయ్‌ భూపతి పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరోవైపు, అక్టోబర్‌ 10న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఓ వైపు నుంచి ప్రకాశ్‌రాజ్‌(prakash raj panel), మరోవైపు నుంచి మంచువిష్ణు(manchu vishnu panel) తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. 'మా' బిల్డింగ్‌ నిర్మాణం, సభ్యుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఈ రెండు ప్యానెల్స్‌ బరిలో పోటీ పడుతున్నాయి.

ఇవీ చూడండి: 'అర్జున్​రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 25వ సినిమా ఫిక్స్​

ABOUT THE AUTHOR

...view details