తెలంగాణ

telangana

ఇండియాలోనే భారీ ఆలయ సెట్​లో 'ఆచార్య'

By

Published : Jan 6, 2021, 9:01 PM IST

'ఆచార్య' సినిమాలోని ఆలయ సెట్​ వీడియోను అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాకు హైలైట్‌గా నిలిచే ఓ ఆలయ సెట్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

chiru tweet on Acharya set
మరో విషయం బయటపెట్టిన చిరు

గతంలో అధికారిక ప్రకటనకు ముందే సినిమా పేరు 'ఆచార్య' అని చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి. ఎంతో రహస్యంగా ఉంచాలనుకున్న టైటిల్‌ను చిరు ప్రకటించడం వల్ల చిత్రబృందం కాస్త నిరాశకు గురైంది. అయితే.. అప్పటి నుంచే సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం మెగాస్టార్‌ మరో రహస్యాన్ని బయటపెట్టారు. ఈసారి అనుకోకుండా కాదు కావాలనే చేశారు. సినిమాకు హైలైట్‌గా నిలిచే ఇండియానే అతిపెద్ద ఆలయ సెట్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ పనులు హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా సురేశ్‌ సెల్వరాజన్‌ పనిచేస్తున్నారు. ఈ మధ్యే చరణ్‌ కూడా ఈ సెట్‌ను పరిశీలించి సురేశ్‌ను మెచ్చుకున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి:'అల'రించిన సంగీత కచేరి.. ఇంకా చూడలేదా?

ABOUT THE AUTHOR

...view details