తెలంగాణ

telangana

చరణ్​తో శంకర్ సినిమా.. షరతు పెట్టిన దిల్​రాజు!

By

Published : Feb 22, 2021, 8:58 PM IST

రామ్​చరణ్​తో​ సినిమా విషయంలో నిర్మాత దిల్​రాజు, దర్శకుడు శంకర్​కు ఓ షరతు పెట్టారట. ఇంతకీ ఏంటది?

budget limitations for director shankar for movie with ram charan
చరణ్​తో శంకర్ సినిమా.. షరతు పెట్టిన దిల్​రాజు

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఓ సినిమా తీయనున్నారు. దిల్‌రాజు నిర్మాతగా ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

భారీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ శంకర్‌. ఇప్పటివరకూ ఆయన ఒక్క తెలుగు హీరోతో కూడా సినిమా చేయలేదు. రామ్‌చరణ్‌ హీరోగా సినిమా అనేసరికి అంచనాలు పెరిగాయి. అలానే శంకర్‌తో సినిమా అంటే మెగా అభిమానులు కాస్త భయపడుతున్నారు. కారణం ఆలస్యం. ఇప్పటివరకూ ఆయన తీసిన ప్రాజెక్టులన్నీ కనీసం రెండు మూడేళ్లు సాగినవే. ఇలాంటి పరిస్థితుల్లో తమ హీరో సినిమా కోసం రెండేళ్లు వేచి చూడాలా? అని అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.

రామ్ చరణ్​తో శంకర్ సినిమా

సినిమా విషయంలో పక్కా ప్రణాళికాబద్ధంగా వెళ్లే నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ప్రతి సినిమాను ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటారు. ఇదే ఫార్ములాను శంకర్‌-చెర్రీ సినిమా మేకింగ్‌ విషయంలోనూ పాటిస్తున్నారట. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయానికి చేసి తీరాల్సిందేనని అంటున్నారట. ఇదే విషయాన్ని శంకర్‌ దృష్టికి తీసుకెళ్లారట. సినిమా మేకింగ్‌ విషయంలో దిల్‌రాజు సూచనలకు శంకర్‌ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం చరణ్‌ 'ఆర్ఆర్‌ఆర్‌', 'ఆచార్య' చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన వెంటనే శంకర్‌తో కలిసి పనిచేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details