తెలంగాణ

telangana

ప్రియాంక​ చోప్రా కోసం రూ.121 కోట్ల భవంతి..!

By

Published : Nov 13, 2019, 9:33 PM IST

సినీ ప్రేమజంట ప్రియాంక, నిక్​ జోనస్​ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎప్పుడు తమదైన ఫ్యాషన్​ దుస్తులు, ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసే ఈ జోడీ.. ఇప్పుడు తమ సొంతింటి కోసం భారీగా ఖర్చుపెట్టి చర్చనీయాంశమయ్యారు.

ప్రియాంక​ చోప్రా కోసం రూ.121 కోట్ల భవంతి.!

కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు బాలీవుడ్‌ నటి ప్రియాంక, హలీవుడ్‌ గాయకుడు నిక్‌ జోనస్‌. తాజాగా ఈ జంట లాస్‌ ఏంజెల్స్​లోని స్థానిక ఎన్సినో ప్రాంతంలో... ఓ ఖరీదైన భవంతిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ.144 కోట్ల (20మిలియన్‌ డాలర్లు) విలువ ఉంటుందని సమాచారం. ఫలితంగా స్థానిక రియల్‌ ఎస్టేట్‌ రికార్డులను ఈ జంట కొల్లగొట్టినట్లు లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది.

20 వేల చదరపు అడుగులతో ఉన్న ఈ ఇంట్లో 7 పడక గదులు, 11 బాత్‌ రూమ్‌లు ఉన్నాయట. ఇంటిముందు విశాలమైన మైదానం దీని ప్రత్యేకత. ఈ జోడీతో పాటు నిక్‌ సోదరుడు జోయీ జోనస్‌ కూడా 14.1 మిలియన్‌ డాలర్ల విలువైన ఓ గృహాన్ని కొనుగోలు చేశాడు. నిక్‌ నివాసానికి కొంత దూరంలోనే ఇది ఉంటుందట. 15 వేల చదరపు అడుగులతో ఉన్న ఈ నివాసంలో 10 పడకగదులు, 14 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. లాస్‌ ఏంజెల్స్‌లో ఓ ఖరీదైన, విలాసవంతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే తమ డ్రీమ్‌ అని ప్రియాంక-జోనస్‌ చాలాసార్లు చెప్పారు. ఇందుకోసం నిక్‌ ఆగస్టులో తన బ్యాచ్‌లర్‌ పాడ్‌ను రూ.6.91 కోట్లకు అమ్మేశాడు.

నిక్​ బ్యాచ్‌లర్‌ పాడ్‌

ఇటీవల విడుదలైన 'ది స్కై ఈజ్‌ పింక్‌' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది ప్రియాంక చోప్రా. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ ఓ వక్తగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న... అయిషా చౌదరి జీవితకథ ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ప్రియా 'ది వైట్‌ టైగర్‌'లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details