తెలంగాణ

telangana

నో ఛేంజ్.. చెప్పిన తేదీకే 'భీమ్లా నాయక్' రిలీజ్

By

Published : Nov 16, 2021, 11:10 AM IST

Updated : Nov 16, 2021, 11:28 AM IST

సంక్రాంతి బరిలో తాను పక్కా ఉంటానని పవన్​ మరోసారి స్పష్టం చేశారు. 'భీమ్లా నాయక్'ను(bheemla nayak release date) చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ పండగకే 'ఆర్ఆర్​ఆర్'(rrr release date), 'రాధేశ్యామ్'(radhe shyam song) సినిమాలు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

bheemla nayak release date
పవన్​ భీమ్లా నాయక్ మూవీ

ఈసారి సంక్రాంతికి రచ్చ రచ్చే. తెలుగులో మూడు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో 'ఆర్ఆర్ఆర్'(rrr release date), 'భీమ్లా నాయక్'(bheemla nayak release date), 'రాధేశ్యామ్'(radhe shyam release date) ఉన్నాయి. ఈ మూడు వరుసగా జనవరి 7, 12, 14 తేదీల్లో థియేటర్లలోకి రానున్నాయి.

అయితే 'భీమ్లా నాయక్'ను వాయిదా(bheemla nayak release date postponed) వేస్తున్నారని గత కొన్నిరోజుల నుంచి తెగ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ తెగ చర్చించుకున్నారు. అయితే అవేవి నిజం కాదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. మంగళవారం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్​తో ఆ వదంతులకు చెక్ పెట్టింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర త్రిముఖ పోటీ ఖరారైంది.

పవన్​ భీమ్లా నాయక్ మూవీ

మలయాళ హిట్​ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా 'భీమ్లా నాయక్'ను(bhemla nayak songs) తీస్తున్నారు. ఇందులో పవన్​ పోలీస్​గా, రానా సినీ నటుడి పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు అభిమానుల్ని తెగ అలరిస్తున్నాయి. 'లా లా భీమ్లా' గీతం(la la bheema song) అయితే యూట్యూబ్​ను షేక్ చేస్తోంది.

ఈ సినిమాలో పవన్​ సరసన నిత్యామేనన్, రానాకు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్​ప్లే, మాటలు అందిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

అయితే సంక్రాంతికి ఈ మూడు సినిమాలతో పాటు మరో రెండు చిత్రాలు కూడా దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే నాగార్జున 'బంగార్రాజు'(bangarraju movie nagarjuna), రాజశేఖర్ 'శేఖర్'(rajasekhar movies). కానీ వీటి విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పండగకు త్రిముఖ పోటీనా లేదా ఐదు సినిమాలు పోటీ పడతాయా అనేది చూడాలి?

ఇవీ చదవండి:

Last Updated :Nov 16, 2021, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details