తెలంగాణ

telangana

నటి మిస్సింగ్​ కేసు విషాదాంతం.. గోనెసంచిలో మృతదేహం..

By

Published : Jan 19, 2022, 6:59 PM IST

Bangladesh Actress Death: బంగ్లాదేశ్​ నటి రైమా ఇస్లాం షీము మిస్సింగ్​ కేసు విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన రైమా విగతజీవిగా ప్రత్యక్షమైంది. రైమా మృతదేహంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నటి మిస్సింగ్​ కేసు విషాదాంతం.. గోనెసంచిలో మృతదేహం.
నటి మిస్సింగ్​ కేసు విషాదాంతం.. గోనెసంచిలో మృతదేహం.

Bangladesh Actress Death: కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన బంగ్లాదేశ్​ నటి రైమా ఇస్లాం షీము కేసు విషాదాంతమైంది. ఇవాళ ఆమె మృతదేహం ఓ గోనెసంచిలో లభ్యమైంది. కనిపించకుండా పోయిన రైమా విగతజీవిగా ప్రత్యక్షమైంది. రైమా మృతదేహంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...

కొద్ది రోజుల క్రితం నటి రైమా ఇస్లాం షీము కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త షెకావత్​ అలీ నోబెల్​ జనవరి 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమె కోసం పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్​ రాజధాని ఢాకాలోని ఓ బ్రిడ్జి వద్ద గోనెసంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం ఆమెదే అని గుర్తించారు. అయితే మృతదేహంపై గాయాలు గుర్తించిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య కేసులో తన ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు.

1998లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రైమా.. సుమారు 25 సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు సీరియల్స్​లోనూ నటించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details